Parasuram: అప్పుడు వంశీ పైడిపల్లి.. ఇప్పుడు పరశురామ్..!

మహేష్ బాబు ఓ ప్రాజెక్టుకి అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. ఒకప్పుడు తనకి హిట్ ఇచ్చిన దర్శకులకి వెంటనే నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు అలా చేయడం లేదు. మహేష్ ఓ సినిమాని ఓకే చేయాలి అంటే..దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ తో రావాలి. అది కూడా మహేష్ కు నచ్చాలి. అప్పుడే ఓకే చేస్తాడు. ‘మహర్షి’ సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి 3 ఏళ్ళ పాటు ఎదురుచూశాడు. నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయబోతున్నట్లు మహేష్ ప్రకటించాడు.

కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. వంశీ … విజయ్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. మహేష్ పరశురామ్(బుజ్జి) తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. పరశురామ్ కు అలాగే వంశీ పైడిపల్లికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అవి ఈ పాటికే అందరికీ అర్ధమైపోయుంటుంది. వంశీ పైడిపల్లి ‘మహర్షి’ ప్రాజెక్టుకి ముందు కొంచెం వెయిట్ ఉండేవాడు. కానీ ఆ సినిమా పూర్తయ్యేసరికి అతను చాలా సన్నపడిపోయాడు.

మహేష్ తన ఫుడ్ హ్యాబిట్స్ ను వంశీ పైడిపల్లికి బాగా అలవాటు చేసెయ్యడం వలన సన్నపడిపోయినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. సరిగ్గా ఇప్పుడు పరశురామ్(బుజ్జి) పరిస్థితి కూడా అంతే..! ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొదలవ్వడానికి ముందు అతను కూడా కొంచెం ఎక్కువ వెయిట్ ఉండేవాడు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పరశురామ్ బక్కచిక్కిపోయాడు. వంశీకి చేసినట్టే పరశురామ్ కు కూడా మహేష్ తన ఫుడ్ హ్యాబిట్స్ ను అలవాటు చేసేశాడని…

అలాగే ట్రైలర్లో ఉన్న డైలాగ్ ‘మెయింటైన్ చేయలేక దూలతీరిపోతుంది’ అనేది కూడా అలానే పుట్టిందని స్పష్టమవుతుంది. ఇక ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ నిన్న విడుదలై యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ ను మహేష్ అభిమానులతో పాటు అందరు ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus