పర్యావరణ పరిరక్షణ గురించి ఇప్పటివరకు టాలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి. అయితే అడవిలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలు, జంతువుల నేపథ్యంలో రూపొందిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి సినిమాలు తీసే దర్శకుడు ప్రభు సాల్మన్. ‘మైనా’, ‘గజరాజు’ లాంటి చిత్రాలు తెరకెక్కించిన ఆయన తాజాగా ‘అరణ్య’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభు సాల్మన్ సినిమా విశేషాలతోపాటు, దేశంలో రక్షణ పరిస్థితి గురించి కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.
‘అరణ్య’లో మనుషులు, ఏనుగుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపిస్తున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో చూపించారు. ఈ అనుబంధంతోపాటు పర్యావరణ పరిరక్షణలో ఏనుగుల పాత్రను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తారట. అయితే ఈ సినిమా ఫారెస్ట్‌మ్యాన్ జాదేవ్ జీవిత కథ అని వార్తలొచ్చాయి. ఈ విషయమై ప్రభు సాల్మన్ స్పందించారు. ఈ సినిమా జాదేవ్ జీవిత కథ కాదు… అయితే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కథానాయకుడి పాత్ర డిజైన్ చేసుకున్నారట.
ఈ సినిమా చిత్రీకరణ అనుభవాల గురించి కూడా ప్రభు సాల్మన్ చెప్పుకొచ్చారు. సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో ప్రారంభించినప్పుడు చిత్ర బృందానికి వింత అనుభవం ఎదురైందట. కెమెరా సెటప్ కోసం అక్కడ అడవిలో కొన్ని కొమ్మల్ని నరికేశారట. దీంతో అటవీ అధికారులు వచ్చి టీంలోని కొందరి పాస్‌పోర్టులు తీసుకున్నారట. అడవుల్లోని సీసీ టీవీ పుటేజీ చూసి వాళ్లు అక్కడకు వచ్చారట. ‘‘థాయ్‌లాండ్‌లో మొక్కల్ని అంత ప్రేమిస్తారు. అదే మన దగ్గర అసలు మనుషులకే ప్రాధాన్యత ఇవ్వరు. రోడ్డుపై మనుషుల్ని నరికితేనే పట్టించుకోవట్లేదు.. మొక్కల్ని నరికితే పట్టించుకుంటారా?’’ అంటూ కామెంట్ చేశారు ప్రభు సాల్మన్. ఇప్పుడు ఈ మాటలే వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!