ప్రశాంత్ నీల్.. ‘కె.జి.యఫ్’ తో యావత్ ప్రపంచం కన్నడ ఇండస్ట్రీ వైపు తల తిప్పి చూసేలా చేసిన దర్శకుడు.. అప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగిన పోరాట నేపథ్యానికి సెంటిమెంట్, ఎలివేషన్స్ అనేవి యాడ్ చేసి ఎవరూ ఊహించని విధంగా ప్రెజెంట్ చేసి, ఇండియన్ ఆడియన్స్‌కి కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చారు.. పార్ట్ 2 కోసం మూవీ లవర్స్ అంతా ఎదురు చూసేలా చేయడమే కాక కన్నడ సినిమా స్థాయిని పెంచారు.
ఈ సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయిన ప్రశాంత్ నీల్ తెలుగు వారేనని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవల మీడియా వాళ్లు ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి చెప్పమంటే.. కథ చెప్పాలా? అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ రీసెంట్‌గా కాస్త ఘాటుగానే స్పందించారు..ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ చేస్తున్నారు. తర్వాత తారక్‌తో సినిమా ఉంది.. దాని తర్వాత దిల్ రాజు బ్యానర్లో ఓ స్టార్ హీరోతో కమిట్‌మెంట్..
దీంతో ఇక ప్రశాంత్ నీల్ కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తారు.. లేకపోతే ఇప్పటివరకు ఇంకో కన్నడ సినిమా ఎందుకు అనౌన్స్ చెయ్యలేదు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.. దీంతో ఆయన కాస్త అసహనానికి గురయ్యారు.. ‘‘నేను ఏ తెలుగు హీరోని కానీ, నిర్మాతని కానీ సంప్రదించలేదు.. వాళ్లే నన్ను అప్రోచ్ అయ్యారు.. అంత మాత్రాన నేను తెలుగు ఇండస్ట్రీకి అమ్ముడుపోయినట్టు కాదు.. నాకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టే సినిమాలు చేస్తున్నాను’’ అని కుండబద్దలు కొట్టినట్టు క్లారిటీ ఇచ్చారు..
కర్ణాటక ప్రభుత్వం స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గౌరవార్థం ఇచ్చిన ‘కర్ణాటక రత్న’ పురస్కార ప్రధాన కార్యక్రమం ‘కర్ణాటక రాజ్యోత్సవ’కు ఎన్టీఆర్‌ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.. అక్కడ ఎయిర్ పోర్టులో తారక్‌ని రిసీవ్ చేసుకోవడానికి ప్రశాంత్ నీల్ వచ్చారు. ఫొటోల కోసం వచ్భిన అభిమానులను నిరుత్సాహ పరచకుండా వారితో పిక్స్ దిగారు.. అలాగే ఇటీవల కృష్ణంరాజు మరణించినప్పుడు కూడా ప్రభాస్‌కి తోడుగా ఉన్నారు. ఆఫ్ స్క్రీన్ కూడా తన హీరోలతో ఆయన ఎంత స్నేహపూర్వకంగా ఉంటారు అనేదానికి ఈ సంఘటనలనే ఉదాహరణగా చెప్పొచ్చు..