‘సలార్‌’లో ‘కేజీఎఫ్‌’ ముద్దుగుమ్మ

తమ గత సినిమాల్లోని హీరోయిన్‌ను తర్వాతి సినిమాల్లో కంటిన్యూ చేయడం కొంతమంది దర్శకులకు సెంటిమెంట్‌. తెలుగులో అలా అనిల్‌ రావిపూడి చేస్తూ ఉంటాడు. తొలి సినిమా ‘పటాస్‌’లోని హీరోయిన్‌ శ్రుతి సోదిని… తన తర్వాతి సినిమా ‘సుప్రీమ్‌’లో తీసుకున్నాడు. అందులో స్పెషల్‌ సాంగ్‌ చేయించాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ప్రశాంత్‌ నీల్‌ ఫాలో అవుతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘కేజీఎఫ్‌’ భామ… ఇప్పుడు ‘సలార్‌’లో ఉండబోతోందట. ‘కేజీఎఫ్‌’ కథానాయిక నిధి శెట్టిని…

‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన చూడబోతున్నాం అనేది కొత్త టాక్‌. అయితే హీరోయిన్‌గా కాదు. స్పెషల్‌ సాంగ్‌లో అట. ‘సలార్‌’లో కీలక సమయంలో ఓ స్సెషల్‌ సాంగ్ ఉందట. అందులో ప్రభాస్‌ సరసన ఎవరు అడిపాడితే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు నిధి శెట్టి పేరు ప్రస్తావనకు వచ్చిందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్‌ సరసన ‘కేజీఎఫ్‌’ బ్యూటీని చూస్తామన్నమాట. అన్నట్లు ఇందులో కథానాయికగా శ్రుతి హాసన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ‘సలార్‌’కు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

ఇటీవల గోదావరి ఖనిలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ సినిమా కథ విషయంలో చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై ప్రశాంత్‌ ఎంత క్లారిటీ ఇచ్చినా ఆగడం లేదు. ప్రశాంత్‌ నుండి వచ్చిన తొలి చిత్రం ‘ఉగ్రమ్‌’కు మెరుగులు అద్ది తెలుగులో ‘సలార్‌’గా తీస్తున్నారనేది పుకార్ల సారాంశం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus