NTR 31: నీల్ మళ్ళీ అదే సెంటిమెంటా?

ప్రశాంత్ నీల్  (Prashanth Neel)  స్టోరీలలో ఒక సెంటిమెంట్ కి ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. ఎంత గ్రాండ్ గా ఉన్నా కూడా, తల్లి సెంటిమెంట్ ను కథకి బేస్ గా పెట్టి అద్భుతమైన ఎమోషన్స్ తో కథను నడిపించడంలో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. ‘కేజీఎఫ్’ (KGF) నుంచి ‘సలార్‌’ (Salaar) వరకు తీసుకున్న చిత్రాలన్నీ మదర్ సెంటిమెంట్ ఆధారంగా ఉండటం విశేషం. తల్లితో ఉన్న అనుబంధాన్ని సమర్థంగా ప్రదర్శించి, ప్రేక్షకులను కనెక్ట్ చేయగలడనేది నీల్ స్పెషాలిటీ.

NTR 31

తల్లి సెంటిమెంట్ కథలో ఉంటే, అది అందరికీ చేరువగా ఉంటుంది. సాధారణంగా మామూలు ప్రేక్షకుడే కాకుండా విభిన్న వర్గాల వారిని ఈజీగా ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ఎప్పుడూ సక్సెస్ అయ్యారు. తాజాగా ‘బఘీరా’ అనే మరో చిత్రం కూడా ఆయన కథను ఆధారంగా చేసుకుని రూపొందింది. మదర్ సెంటిమెంట్ తో కథ ప్రారంభమై, క్రమంగా మూడ్ మార్చి పీక్ లెవెల్ కి తీసుకెళ్లడం ఈ దర్శకుడి ప్రత్యేకత.

ఇప్పుడీ మథర్ సెంటిమెంటుకి కొత్త టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR) తో మరో భారీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ఈ సినిమా కథ ఏంటని, ఏ విషయం కూడా బయటకి రావడం లేదు. మరి ఇందులో కూడా తల్లి సెంటిమెంట్ ఉంటుందా? లేక, అందరికీ కొత్తగా అనిపించే ఏమోషన్ తో కధ నడిపిస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది.

నీల్ రాసిన ప్రతి కథలో మదర్ సెంటిమెంట్ ఒక ప్రధానమైన అంశం అవుతుందనేది అంచనా. ఇక తారక్ కోసం ప్రశాంత్ కూడా కొత్త తరహాలో తన మార్క్ క్రియేటివిటీ ని ప్రదర్శించబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. మరి, అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

దేవర భామ.. ఈమె అందానికి కూడా ఫిదా అవ్వాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus