యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉండటంతో, జనవరి చివర్లో ఈ ప్రాజెక్ట్ లో చేరుతారని అంచనా. ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు ప్రత్యేక మార్పులు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తీసిన సినిమాలు, ముఖ్యంగా కేజీఎఫ్ (KGF) సిరీస్ మరియు సలార్ (Salaar) అన్నీ డార్క్ విజువల్స్, బ్లాక్ థీమ్ లోనే ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు రొటీన్ ఫీలింగ్ తో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సలార్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు బ్లాక్ థీమ్ కి ఓవర్‌డోస్ అనిపిస్తోందని అన్నారు. నీల్ ఇక బొగ్గు రంగు నుంచి బయటకు రావడం కష్టమే అనేలా కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కొత్తదనం చూపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కొత్త ప్రాజెక్ట్ లో ప్రశాంత్ డిఫరెంట్ కథా నేపథ్యం, బ్రైట్ విజువల్స్ తో కొత్త తరహా థీమ్ లో సినిమాను తెరకెక్కించనున్నారట.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్న బ్లాక్ థీమ్‌ను కేవలం ఫస్ట్ లుక్ కోసం మాత్రమే వాడినట్లు తెలుస్తోంది, సినిమాలో దీని ప్రభావం ఉండదట. ఈ సినిమా బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని, అక్కడ తెలుగు వారికి సపోర్ట్‌గా నిలిచే కథాంశం ఉందని కూడా టాక్ వస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది.
2026 సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాలో హీరో పాత్రలో కొత్తదనం ఆశిస్తున్నారు. ప్రశాంత్ కూడా తన గత సినిమాల్లాగే కాకుండా ఒక కొత్త తరహా ప్రయోగం చేస్తే, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.