పౌరాణికం నేపథ్యంలో సినిమా చేయాలంటే చాలా గట్స్ కావాలి. మన దగ్గర అలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఇక సోషియో ఫాంటసీ అంటే దమ్ము కిలోల లెక్కన ఉండాలి. ఇలాంటివీ మన దగ్గర తక్కువే. అయితే ఈ రెండింటినీ మిక్స్ చేసి ఓ సినిమా చేస్తా అంటున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఇదే తన డ్రీమ్ ప్రాజెక్టు అని కూడా చెబుతున్నాడు. ‘ఆ!’, ‘జాంబిరెడ్డి’ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడాయన.
‘ఆ!’ వచ్చినప్పుడు ఈ డైరక్టర్‌లో విషయం ఉంది అనిపించుకున్నాడు ప్రశాంత్. రెండో సినిమా జాంబీల కాన్సెప్ట్ ఎంచుకొని తాను వన్ సినిమా వండర్ కాదు అని నిరూపించుకున్నాడు. మూడో సినిమా సంగతి ఇంకా ఏమీ ప్రకటించలేదు. అయితే మొదటి రెండు సినిమాలకు సీక్వెల్ ఉంటుంది అని మాత్రం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ రెండింటిలో ఒకటి తన మూడో సినిమా అవుతుందా అని అందరూ అనుకుంటుండగా, ఆయన వెబ్ సిరీస్‌ల పనిలో పడ్డాడు. ఇటీవల హాట్‌స్టార్‌కి ఒకటిచ్చాడు. ఇంకో రెండు పనులు జరుగుతున్నాయట.
ముందు చెప్పుకున్నట్లు పౌరాణికం, సోషియో ఫాంటసీ ఆయన కలల సినిమా అట. పదేళ్లుగా ఆ కథపై ప్రశాంత్ వర్మ వర్క్ చేస్తున్నాడట. పౌరాణిక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ సినిమా అది ఉంటుంది. అయితే అంతటి స్క్రిప్ట్‌ని తెరకెక్కించే అనుభవం ఇంకా రాలేదని ఆయన అనుకుంటున్నాడు. అలాంటి సినిమా ఎలా తీయాలనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడట. ఒక్కో సినిమాతో అవసరమైన విషయాలు నేర్చుకుంటున్నాడట. వీలైనంత త్వరగా సినిమా ప్రారంభించి, ఆ కలను చేసుకుంటా అని చెబుతున్నాడు ప్రశాంత్ వర్మ.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!