‘బాహుబలి'(సిరీస్) తెలుగు సినిమా స్టామినాని పెంచిన సినిమా. మన తెలుగు సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ చేసుకోవచ్చు అని రుజువు చేసిన సినిమా..! దీని తర్వాతే మన టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. అయితే రాజమౌళి మాత్రమే దీనిని మొదలుపెట్టాడు అనుకుంటే పొరపాటే..! అంతకు ముందు మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ గురించి ట్రై చేసాడు. అది ఏ చిత్రంతోనో తెలుసా..! మహేష్ బాబుతో చేసిన ‘బిజినెస్ మెన్’ చిత్రంతో..!
2012 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబుని ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ లో ప్రెజెంట్ చేసి కూడా సూపర్ హిట్ అందుకున్నాడు పూరి. అయితే చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. నిజానికి ‘బిజినెస్ మెన్’ ను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చెయ్యాలని పూరి ప్లాన్ చేసాడు. అంటే ‘బాహుబలి’ మొదలవ్వడానికి ముందే అన్న మాట. తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చెయ్యాలి అనుకున్నారు.
కానీ విడుదల సమయానికి వేరే భాషల్లో స్టార్ హీరోల సినిమాలు పోటీగా ఉండడం.. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తికాకపోవడం.. మిగిలిన వెర్షన్లకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడం వంటి కారణాలతో .. పాన్ ఇండియా ఐడియాను మార్చుకున్నాడట పూరి జగన్నాథ్. లేకపోతే టాలీవుడ్లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే అయ్యి ఉండేదని కొందరు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.