టాలీవుడ్ డ్రగ్స్ కేసు : కొడుకుతో పాటు ఈడీ కార్యాలయానికి వెళ్లిన పూరి..!

4 ఏళ్ళ తర్వాత మళ్ళీ టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం మళ్ళీ చర్చల్లో నిలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వారు ఈ విషయం పై పలు కీలక ఆధారాలను సేకరించి పలువురు సినీ ప్రముఖులకు సమన్లు పంపిన సంగతి తెలిసిందే.ఈ లిస్ట్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు.తాజాగా ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యాడు. అధికారులు పూరిని విచారించి డ్రగ్స్ డీలర్లకు సంబంధించిన విషయాలను సేకరించాలనేది వారి మెయిన్ థీమ్.

ఆ దిశగానే వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పూరితో నవదీప్, రకుల్, రానా, రవితేజ వంటి మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా వారు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. పూరితో పాటు అతని కొడుకు ఆకాష్ కూడా ఈడీ మీటింగ్ కు వచ్చాడని తెలుస్తుంది. సీఏ(చార్టెడ్ అకౌంటెట్) ఈడీ కార్యాలయంలో అతన్ని కూడా అధికారులు ప్రశ్నించారట. 4ఏళ్ళ క్రితమే టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వ్యవహారం నుండీ బయటపడ్డారు అనుకుని రిలాక్స్ అయ్యేలోపే మళ్ళీ ఈడీ ఈ విషయాన్ని తెరపైకి తేవడం టాలీవుడ్ సెలబ్రిటీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ప్రస్తుతం 62 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ దృష్టిలో పడ్డారు.వీళ్ళని విచారించడంతో పాటు వీళ్ళ బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ ను కూడా పరిశీలించాలని వారు భావిస్తున్నారట. మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన వంటి వాటి కింద ఇప్పటికే 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటిసులు జారీ చేయడం గమనార్హం.ఆగష్ట్ 31నుండీ సెప్టెంబర్ 22 వరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలను ఈడీ విచారించనుంది.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus