జీవితం గురించి, ప్రపంచం గురించి, మనుషుల గురించి తన భావాలను మ్యూజింగ్స్ పేరుతో వెల్లడిస్తున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. ఫస్ట్ లాక్‌డౌన్ సమయంలో మొదలైన ఈ పాడ్‌కాస్ట్ సందేశాల పరంపర చాలా రోజులు కొనసాగింది. మళ్లీ ‘లైగర్’ షూటింగ్ మొదలవ్వడంతో ఆపేశారు. మధ్యలో కొన్ని రోజులు వీడియో/ ఆడియోలు విడుదల చేశారు. మళ్లీ చిత్రీకరణలు స్టార్ట్ అవ్వడంతో ఆపేశారు. ఇప్పుడు తిరిగి కరోనా కమ్మేయడంతో తిరిగి మ్యూజింగ్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ విడతో తొలి మ్యూజింగ్‌గా ఇకిగాయ్ గురించి చెప్పారు పూరి.
ఆనందం కోసం జపనీయుల దగ్గర ‘ఇకిగాయ్’అనే ఓ కాన్సెప్ట్ ఉంటుంది. డబ్బు సంపాదించటం, కోరకల్ని తీర్చుకోవటం, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవడంలో… ఏం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటామనేది తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ జీవితంలో ఒక ఇకిగాయ్ ఉండాలి. నిజానికి పూర్వం మనుషులంతా వేటగాళ్లలా బతికారు. తర్వాత మన పనులు మారిపోయాయి. కొత్త పనులు పుట్టుకొచ్చాయి. కొంతమందికి పెయింటింగ్ అంటే ఇష్టం, ఇంకొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం. అలాంటి ఇష్టమైన పనులు చేస్తుంటే అనవసరమైన ఆలోచనలు మీకు రావు. పైగా ఆనందం వస్తుంది. కానీ, డబ్బు ఎవరిస్తారు? అందుకే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతుంటాం అని ఇకిగాయ్ గురించి వివరించారు పూరి.
సౌకర్యవంతమైన జీవితం కావాలంటే డబ్బు కావాలి. అది ఎంతో ఎవరికీ తెలియదు. నీకు నచ్చింది చేయడం, ప్రపంచానికి నచ్చింది చేయడం, ఎక్కువ డబ్బు వచ్చే పని చేయడం,నువ్వు ఎందులో స్పెషలిస్టువో ఆ పని చేయడం… ఈ అంశాల్లో మీరు ఎందులో ఉన్నారో చెక్ చేసుకోవాలి. 1 అండ్ 4 మధ్య ఉంటే అది ప్యాషన్. అలా బతుకుతుంటే దాని ద్వారా డబ్బెలా సంపాదించాలో ఆలోచించాలి. ఒకవేళ 1 అండ్ 2 మధ్య ఉంటే అది మిషన్.
మీ పనిని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచించండి. 3 అండ్ 4 మధ్య ఉంటే అది ప్రొఫెషన్. ఇందులో మీకు నచ్చినవి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. 2 అండ్ 4 మధ్య ఉంటే వొకేషన్ అనొచ్చు. చేస్తున్న పనిని సవాలుగా తీసుకుని ఇంకా మెరుగ్గా ఉండేలా చూడాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా మనకేం కావాలో తెలియాలి. మనం ఏం చేస్తున్నామో తెలియాలి. అదే ఇకిగాయ్. అంటే రీజన్ ఫర్ యువర్ బీయింగ్ అని అర్థం అంటూ పూరీ మ్యూజింగ్ పూర్తి చేశారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!