దర్శకుడు పూరి జగన్నాధ్ దాదాపు మూడేళ్లుగా ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ‘లైగర్’ సినిమా షూటింగ్ లో భాగంగా ఎక్కువ సమయం అక్కడే గడిపారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తరువాత పూరి ‘లైగర్’ సినిమా మొదలుపెట్టి ముంబై వెళ్లి రావడం ప్రారంభించారు. అయితే కోవిడ్ కారణంగా ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ‘లైగర్’ సినిమా పనులతో అక్కడే ఉండిపోయారు. ‘లైగర్’ షూటింగ్ దాదాపుగా ముంబైలోనే జరిగింది. పూరి అండ్ టీమ్ అక్కడే ఉన్నారు.
అయితే ఈ మూడేళ్లలో ఈ టీమ్ అంతా ముంబైలో ఉండడానికి, హోటల్ ఖర్చులకు, ఫ్లైట్ ఖర్చులకు.. ఇతర మెయింటైనెన్స్ కు మొత్తం కలిపి కోట్లలో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ‘లైగర్’ సినిమా బడ్జెట్ లోనే ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేసినట్లు సమాచారం. మొత్తం కలిపి రూ.20 కోట్లకు దగ్గరగా ఖర్చయినట్లు చెబుతున్నారు. అంటే నెలకు అరకోటికి పైగానే ఖర్చు చేశారన్నమాట. టాలీవుడ్ వర్గాలు మాత్రం ఇంత ఖర్చయి ఉంటుందా..?
అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబైలో కాస్ట్ ఆఫ్ లివింగ్, అక్కడి రేట్లు, హోటల్స్, స్పెషల్ ఫ్లైట్స్ ఇవన్నీ చూసుకుంటే ఇరవై కోట్లు పెద్ద అమౌంట్ కాదనే చెప్పాలి. కానీ ఈ మొత్తమంతా ఒక సినిమా మీదే పడుతుందంటే నిర్మాతలకు అదనపు భారమనే చెప్పాలి. సినిమాకి కూడా బాగానే ఖర్చు చేశారు. మైక్ టైసన్ లాంటి దిగ్గజాన్ని తీసుకొచ్చారు. అలానే టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేశారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!