Mahesh Babu, Rajamouli: మహేష్ సినిమాపై మరో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి!

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుంది అని ప్రస్తుతం హడావిడి చూస్తుంటే క్లారిటీగా అర్థం అవుతోంది. మొదటి రోజే ఈ సినిమా ఈజీగా వందకోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా బాక్సాఫీస్ పండితులు చెబుతున్నారు. అయితే దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా బెంగుళూరు కి వెళ్లిన విషయం తెలిసిందే.

Click Here To Watch NEW Trailer

అక్కడ చిక్బల్లాపూర్ లో RRR ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. అయితే ఆ వేడుక జరిగే ముందు బెంగళూరులో కన్నడ మీడియాతో మాట్లాడిన రాజమౌళి తన తదుపరి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పాడు. మహేష్ బాబు తో రాజమౌళి తదుపరి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్టుగా రాబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్టు కాదు అని రాజమౌళి మొదటిసారి క్లారిటీ ఇచ్చేశాడు.

ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలపై పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం RRR సినిమా పైనే ఉంది అంటూ ఈ సినిమా విడుదల తర్వాత కొన్ని రోజుల పాటు హాలిడేస్ కి వెళ్లి ఆ తర్వాత మహేష్ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు రాజమౌళి ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

ఆ సినిమా అనంతరం త్రివిక్రమ్ సినిమాను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆ తర్వాత మహేష్ బాబు సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు ఇక రాజమౌళి కూడా ఇప్పటికే మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి ఉంచాడు. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని గతంలో రచయిత విజయేంద్రప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు. మరి దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు ను ఎలా చూపిస్తాడో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus