ఫస్ట్ ప్లేస్‌కి వెళ్లాలంటే.. ముందు రెండో ప్లేస్‌లో ఉన్నవాడిని దాటాలి. ఆ తర్వాత అప్పుడు ఫస్ట్ ప్లేస్‌కి వెళ్లొచ్చు. జపాన్‌లో రాజమౌళి ఇప్పుడు ఆ రెండో ప్లేస్‌పై దృష్టిపెట్టారా? ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా వసూళ్లు చూస్తే.. అదే అనిపిస్తోంది. జపాన్‌లో మన దేశం సినిమాలకు, అందులోనూ సౌత్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలా అని అన్ని సినిమాలకు ఈ ఆదరణ దక్కదు. అలా రీసెంట్ టైమ్స్‌లో మంచి ఆదరణ పొందుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాకు 17 రోజులకలో 185 మిలియన్ యెన్లు వచ్చాయి మరి.
అయితే రాజమౌళి ఆలోచన ఇక్కడతో ఆగడం లేదు అంటున్నారు. ఆయన చూపు ఇంకాస్త ముందుకు ఉంది అని అంటున్నారు. ఈ సినిమా వసూళ్లు మరింత స్థాయిలో పెరిగి టాప్ 2లోకి వెళ్లాలి అంటున్నారు. జపాన్‌లో మన సినిమాల వసూళ్ల గురించి చూస్తే.. తొలి స్థానంలో రజనీకాంత్ ‘ముత్తు’ ఉంది. ఈ సినిమా సుమారు 400 మిలియన్ యెన్లు సంపాదించింది. ఆ తర్వాత స్థానంలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఉంది. ఈ సినిమాకు 300 మిలియన్ యన్లు వచ్చాయి. ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ ‘బాహుబలి 2’ అనే చెప్పాలి.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను ఇంకాస్త ప్రమోట్ చేసి తొలుత రెండో స్థానంలో ఉన్న రెండో ‘బాహుబలి’ని కిందకు దింపాలని చూస్తున్నారట రాజమౌళి. ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ‘ముత్తు’ సంగతి చూడొచ్చు అనేది ఆయన ఆలోచనట. ఆ ఛాన్స్ ఇప్పుడు రాకపోయినా, నెక్స్ట్ సినిమాకే చూడొచ్చు అని అనుకుంటున్నారట. ఎందుకంటే నెక్స్ట్ రాజమౌళి చేయబోయే సినిమా మహేష్‌బాబుతో కాబట్టి. అది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఉన్న అడ్వెంచరస్ సినిమా కాబట్టి. దానికి జపాన్‌లో ఇంకా ఎక్కువ ఆదరణ ఉంటుందని అనుకుంటున్నారట.
దీంతోపాటు రాజమౌళికి మరో ఆలోచన కూడా ఉంది. అదే ఆస్కార్. ‘ఆర్ఆర్ఆర్’ను మన దేశం నుండి నేరుగా ఆస్కార్‌కి పంపకపోయినా.. జనరల్ కేటగిరీలో ఈ సినిమాను కొన్ని విభాగాల కోసం ఆస్కార్ బరిలో నిలిపారు. దాని కోసం అమెరికాలో ‘ఎన్‌కోర్’ పేరుతో ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు జపాన్‌లోని స్పెషల్ రిలీజ్ కూడా ఉపయోగపడుతుంది అని జక్కన్న టీమ్ అనుకుంటున్నారట.