Rajamouli: జక్కన్న ఫ్యాన్స్ కు మరో షాక్ ఇస్తారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీగా అంచనాలు నెలకొన్న ఆర్ఆర్ఆర్ 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడంతో పాటు ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చరణ్, తారక్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ మూవీ తమ హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్ రిలీజవుతుందని వార్తలు వస్తుండగా తాజాగా జరిగిన ఈవెంట్ లో ఉన్న పోస్టర్స్ లో జనవరి రిలీజ్ అని పేర్కొన్నారు.

ఈవెంట్ లో రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేకపోవడంతో రాజమౌళి మళ్లీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీస్థాయిలో చేశారని వార్తలు వస్తుండగా రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాల్సి ఉంది. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో జక్కన్న ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారని నవంబర్ నెల నుంచి సినిమాకు సంబంధించిన వరుస అప్ డేట్లను జక్కన్న ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు 70 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజమౌళి త్వరలో సెకండ్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus