స్టార్ డైరెక్టర్ రాజమౌళి కెరీర్ లో మగధీర ప్రత్యేకమైన సినిమా అనే సంగతి తెలిసిందే. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సాధారణ సన్నివేశాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కిస్తూ దర్శకుడు రాజమౌళి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు. మగధీర సినిమాలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయిన సమయంలో గుర్రం సాయం చేస్తుందనే సంగతి తెలిసిందే.
తాజాగా ఒక సందర్భంలో ఈ సీన్ గురించి జక్కన్న మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని కొదమసింహం మూవీలో రౌడీలు చిరంజీవిని ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోగా గుర్రం చిరంజీవి నోటికి తాడును అందించి చిరంజీవి ప్రాణాలను కాపాడుతుందని అయితే ప్రాణాలు కాపాడిన చిరంజీవికి, గుర్రానికి మధ్య అనుబంధం లేకపోవడంతో తాను నిరుత్సాహపడ్డానని జక్కన్న తెలిపారు. తన దృష్టిలో అది గుర్రం కాదని ప్రాణాలు కాపాడిన వ్యక్తి అని జక్కన్న చెప్పుకొచ్చారు.
ఆ సీన్ మైండ్ లో ఉండిపోవడంతో మగధీరలో గుర్రం చరణ్ ను కాపాడిన తర్వాత చరణ్ గుర్రంతో కృతజ్ఞతాభావంతో మాట్లాడేలా సీన్ రాశానని జక్కన్న తెలిపారు. ఇసుక ఊబి నుంచి బయటకు వచ్చిన చరణ్ గుర్రాన్ని కౌగిలించుకుంటాడని ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్పూర్తి పొందిన సన్నివేశాలను తాను తెరకెక్కించానని రాజమౌళి పేర్కొన్నారు. చిరంజీవి అలా చేయలేకపోయినా చరణ్ తో ఆ సీన్లను చేయించానని రాజమౌళి చెప్పకనే చెప్పేశారు. రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కించగా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!