టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి వల్లే టాలీవుడ్ పరిస్థితి మారిందా? అనే ప్రశ్నకు అవుననే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి తన సినీ కెరీర్ లో ఎన్నో రిస్క్ లు తీసుకున్నారు. అయితే ఆ రిస్క్ లకు తగిన ఫలితం దక్కిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. డైరెక్టర్ రాజమౌళి మగధీర సినిమాను తెరకెక్కించే సమయానికి ఆ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా కావడం గమనార్హం. మొదట అనుకున్న బడ్జెట్ కంటే మగధీర సినిమాకు రెట్టింపు బడ్జెట్ అయింది.
అయితే కథపై ఉన్న నమ్మకం వల్ల రాజమౌళి వెనుకడుగు వేయలేదు. బాహుబలి1, బాహుబలి2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కడానికి జక్కన్న కారణమనే సంగతి తెలిసిందే. నిర్మాతలు నష్టాలతోనే బాహుబలి ది బిగినింగ్ సినిమాను రిలీజ్ చేయగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా రిలీజైన తర్వాత లాభాలు దక్కాయి. మంచి కంటెంట్ తో తెరకెక్కిన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో కూడా సంచలనాలు సృష్టించడం సాధ్యమేనని జక్కన్న ప్రూవ్ చేశారు.
జక్కన్న స్పూర్తితో టాలీవుడ్ ఖ్యాతి పెరగగా ప్రస్తుతం ఇతర దర్శకులు సైతం పాన్ ఇండియా సినిమాల దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో సైతం ప్రస్తుతం సౌత్ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు సినిమాలు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం కష్టమనే అభిప్రాయం ఉండగా రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో ఈ అభిప్రాయాన్ని మార్చేశారు.
భవిష్యత్తును ముందుగానే అంచనా వేస్తూ ఇతర భారీ సినిమాలకు జక్కన్న భారీ టార్గెట్ లను సెట్ చేస్తుండటం గమనార్హం. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా జక్కన్న అంచనాలకు మించిన రికార్డులను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న ధైర్యం వల్లే టాలీవుడ్ కు ఈ స్థాయి సక్సెస్ లు దక్కాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.