Rajamouli: మహేష్ వల్ల రాజమౌళికి మంచి బేరం కుదిరిందిగా..!

మహేష్ బాబు (Mahesh Babu)  , రాజమౌళి  (Rajamouli)  కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ లో ఎంతటి హైప్ నెలకొని ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మహేష్ అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా, మహేష్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాకు ఒక బిగ్ మైల్ స్టోన్ గా మారే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన టాక్ వైరల్ గా మారింది.

Rajamouli

సాధారణంగా రాజమౌళి చేసిన సినిమాలకు రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్స్ లో వాటా తీసుకుంటారనే టాక్ ఉంది. RRR సినిమా సమయంలో కూడా జక్కన్న భారీ ప్రాఫిట్ షేర్ పొందారని సమాచారం. అయితే, ఆ సినిమాలో ఇద్దరు హీరోలు – రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉండటం వలన, ఆయనకు వచ్చిన లాభం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. కానీ SSMB29లో మహేష్ ఒక్కరే హీరోగా నటిస్తుండటంతో, ఈసారి రాజమౌళికి పెద్ద మొత్తంలో ప్రాఫిట్ షేర్ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

దాదాపు 1000 కోట్లకు పైనే బిజినెస్ జరుగుతుంది కాబట్టి మరోసారి జక్కన్న ఊహించని స్థాయిలో షేర్ అందుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, రాజమౌళి పాన్ వరల్డ్ లెవెల్ లో ఉన్న క్రేజ్ కారణంగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ, ఓవర్సీస్, థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతాయన్న నమ్మకం ఉంది.

SSMB29 సినిమా పాజిటివ్ మౌత్ టాక్ సంపాదించుకుంటే, మహేష్ తో కలిసి రాజమౌళికి మంచి బేరం కుదిరినట్లే. క్లాస్, మాస్ ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకునేలా మహేష్ పాత్ర ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మహేష్ కూడా ఈ సినిమాకు తన బెస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక రాజమౌళి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు, త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

ఈ కామెంట్లు విన్నారంటే ఆ హీరోలంతా శృతిపై ఫైర్ అవ్వడం ఖాయం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus