Rajamouli: స్పెషల్‌ వీడియో రెడీ చేస్తున్న సుకుమార్‌ టీమ్‌.. ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్‌..!

రాజమౌళి (S. S. Rajamouli) – సుకుమార్‌ (Sukumar) మధ్య చాలా మంది అనుబంధం ఉంది. గతంలో ఒకరి సినిమా కోసం ఒకరు ప్రచారం చేశారు. ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి సినిమాల్లో మనం గమనించని ఎన్నో విషయాలు మనకు తెలిశాయి. ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు అంటే.. మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి ఏ సినిమా ప్రచారం కోసమో కాదు. ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) సినిమా సెట్‌కి వెళ్లి మరీ కలిశారట.

Rajamouli

ఇప్పుడు ఈ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సినిమా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు తన మహేష్‌బాబు (Mahesh Babu) సినిమా కోసం రాజమౌళి ఇటీవల రామోజీ ఫిలింసిటీకి వచ్చేశారు. ‘బాహుబలి’ (Baahubali) సినిమాల తరహాలో మొత్తం సినిమా పనులు అక్కడే ఉంటాయి అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి, సుకుమార్‌ కలిశారట. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా సెట్‌కి వెళ్లిన రాజమౌళి.. కొద్దిసేపు టీమ్‌తో మాట్లాడాటర.

అల్లు అర్జున్‌ (Allu Arjun) తదితర నటులతో తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకున్నారట. సుకుమార్ తీసిన ఓ సీన్ చూసి తెగ మెచ్చేసుకున్నారు అని కూడా వార్తలొస్తున్నాయి. ఏంటీ ఇంకా ఫొటోలు బయటకు రాలేదు అని అనుకుంటున్నారా? ఇలా అనుకునేవారికి ఫీస్ట్‌ ఇచ్చేలా ఓ వీడియోను రిలీజ్‌ చేస్తారు అని చెబుతున్నారు. ‘పుష్ప’తో జక్కన్న వీడియో త్వరలో విడుదల ఏస్తారు అని చెబుతున్నారు.

మరి ఆ వీడియోలో ఏముంది, ఏమన్నా మాటలు వినిపిస్తాయా? లేక కేవలం విజిటింగ్‌ ఫుటేజ్‌ మాత్రమే రిలీజ్‌ చేస్తారా అనేది చూడాలి. ఇక మహేష్‌ సినిమా కోసం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. లుక్‌ విషయంలో ఇంకా క్లారిటీ రానందున సినిమా పట్టాలెక్కడంలో కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అంతా ఓకే అనుకున్నాక తనదైన శైలిలో రాజమౌళి ప్రెస్‌ మీట్‌ పెట్టి వివరాలు వెల్లడిస్తారట.

చరణ్ విషెస్ తో లెక్క మారినట్టేనా.. దేవరకు సపోర్ట్ లభిస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus