నేడు టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. గతేడాది క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన రవితేజ ఈ ఏడాది ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఖిలాడీ మూవీ ఫిబ్రవరి నెల 11వ తేదీన రిలీజ్ కానుండగా రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మార్చి 25వ తేదీన రిలీజ్ కానుంది.
రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం వీర సినిమా తెరకెక్కి రిలీజ్ కాగా ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా రమేష్ వర్మకు రవితేజ మరో అవకాశం ఇచ్చారు. రవితేజ నిరాడంబరం, నిర్మొహమాటం, నిబద్ధత, నిజాయితీ ఉన్న వ్యక్తి అని రవితేజ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానని రమేష్ వర్మ తెలిపారు. రవితేజ మిస్టర్ మిరాకిల్ అని సరిగ్గా బ్రతకడమంటే టైమ్ వేస్ట్ చేయకుండా మన పని మనం చేయడమే అని ఆయన నేర్పించారని రమేష్ వర్మ అన్నారు.
రవితేజ రిజల్ట్ ను కాకుండా ఎఫర్ట్ ను గుర్తిస్తారని తనకు కిక్ ఇచ్చిన కథ ఖిలాడీ అని ఈ సినిమాలో కొత్త రవితేజను చూస్తారని రమేష్ వర్మ వెల్లడించారు. పాజిటివ్ మైండ్ తో రవితేజ ఉంటారని పని గంటలను వేస్ట్ చేసినా, పని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన సహించరని రమేష్ వర్మ తెలిపారు. రవితేజ నచ్చకపోతే ఓపెన్ గా చెబుతారని తప్పు చేస్తే ముఖం మీదే తిట్టేస్తారని రమేష్ వర్మ పేర్కొన్నారు.
రవితేజ చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని ఆయన టీజింగ్ గా తిడతారని రమేష్ వర్మ తెలిపారు. గతేడాది మే 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ఖిలాడీ కరోనా వల్ల ఈ ఏడాది రిలీజవుతోంది. 50 శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉన్నా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.