రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను రవితేజతో ‘వీర’ అనే సినిమా తీసాడు. అది పెద్ద ప్లాప్ అయ్యింది. అయినా రమేష్ వర్మకి ‘ఖిలాడి’ చేసే అవకాశాన్ని ఇచ్చాడు రవితేజ. ఈ చిత్రానికి ఏకంగా రూ.65 కోట్లకి పైగా బడ్జెట్ అయ్యిందని టాక్.రవితేజ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్.అనవసరంగా రమేష్ వర్మ ఈ చిత్రానికి ఎక్కువ బడ్జెట్ పెట్టించేసాడు అని ఆడియెన్స్ ఫీలింగ్ అలాగే రవితేజ ఫీలింగ్ కూడా.
అందుకే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత కోనేరు సత్యనారాయణతో ‘మీరు దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాలి.. మీకు అన్ని విషయాలు తెలీవు’ అంటూ చెప్పాడు రవితేజ. అంతేకాదు ‘ఖిలాడి’ సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా టెక్నికల్ టీం కి వెళ్తుందని.. అలాంటి టీం ను దర్శకుడు రమేష్ వర్మకి ‘అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు నిర్మాత ఇచ్చాడని, అతను జాతకుడు, మహార్జాతకుడు అని, తనకి వాటి పై నమ్మకం లేకపోయినా రమేష్ వర్మని చూస్తే వాటిని నమ్మాల్సి వస్తుందని’ రవితేజ చెప్పాడు.
అంతేకాదు ‘పుష్ప’ కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన శ్రీకాంత్ విస్సాని తనకి పరిచయం చేసినందుకు మాత్రమే దర్శకుడు రమేష్ వర్మకి థాంక్స్ చెబుతున్నానని కూడా రవితేజ అన్నాడు. ఈ కామెంట్ల పై దర్శకుడు రమేష్ వర్మ భార్య మండిపడింది. పరోక్షంగా రవితేజ పై సెటైర్లు వేసింది. ‘దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమైంది’, ‘అరటిపండ్లు మీకు బాగా వచ్చు అనుకుంట తీయడం.
డైరెక్టర్ గారు నెక్స్ట్ టైం క్లాసెస్ తీసుకోండి RT దగ్గర. అరటిచెట్టు నరికి ఇచ్చినా సరిపోలేదు RTకి. డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది అది మీకు చెప్పి చేయిస్తేనే కెమెరాలో యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తావ్.క్రెడిట్ గోస్ టు డైరెక్టర్’ అంటూ తన ఇన్స్టా స్టోరీస్ లో పెట్టింది. చివర్లో ‘మాస్ నే క్లాస్ చేసిన డైరెక్టర్, థియేటర్లో కనిపిస్తుంది రమేష్ గారు మీ వేల్యూస్ రేపు థియేటర్లో కలుద్దాం’ అంటూ తన భర్త రమేష్ వర్మ గురించి చెప్పుకొచ్చింది రేఖ వర్మ అలియాస్ స్వీటీ వర్మ.
1
2
3
4
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!