Ravi Babu: చంద్రబాబుకు మద్దతుగా డైరెక్టర్ రవిబాబు!

చంద్రబాబు స్కిల్ డెవలప్ స్కామ్ లో అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే పక్క ఆధారాలతో అధికారులు ఈయనని అరెస్టు చేసినప్పటికీ టిడిపి నేతలు కార్యకర్తలు ఈ విషయం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తూ ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారు అంటూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఆధారాలను కూడా బయటపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఇప్పటికే ఎంతో మంది రోడ్లపైకి వస్తూ నిరసనలు తెలియజేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ విషయంపై ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. తాజాగా డైరెక్టర్ నటుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడుతూ ఆయన అరెస్టును వ్యతిరేకించారు. ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడుతూ రవిబాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ జీవితంలో ఏది శాశ్వతం కాదు సినిమా వాళ్ళ గ్లామర్ రాజకీయ నాయకుల పవర్ ఎప్పుడు శాశ్వతం కాదని ఈయన (Ravi Babu) తెలియజేశారు.

బాబు నాయుడు గారు ఉన్న విజనరీ ఉన్న నాయకుడు ఆయన ఒక పని చేస్తున్నారు అంటే వంద రకాలుగా ఆలోచించి ఆ పనిని ప్రారంభిస్తారు. ఇక ఆయనకు ఈ భూమిపై ఇదే చివరి రోజు అని తెలిస్తే కనుక 50 సంవత్సరాలకు సరిపడే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారంటూ ఈయన తెలియజేశారు. ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారు అర్థం కావడం లేదని తెలిపారు. రాజకీయాలలో ఎత్తుకు పై ఎత్తులు ఉండటం సర్వసాధారణం.

అయితే 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని జైలులో పెట్టి విచారణ చేయించడం చాలా నేరమని, ఇది చాలా దారుణమని తెలిపారు. ఆశాశ్వతమైన పవర్ ఉన్న వారిని నేను వేడుకొనేది ఒకటే మీరు ఏ పవర్ వాడి ఆయనని జైల్లో పెట్టారో అదే పవర్ వాడి తనను బయటకు తీసుకురండి బయట మీకు ఇష్టం వచ్చిన విధంగా ఆయనని ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆయన దేశం దాటిపోయే వ్యక్తి కాదు మీరు చిటికేస్తే అన్ని క్షణాలలో జరిగిపోతాయి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus