భూమిక వల్ల చాలా ఇబ్బంది పడ్డాను

డిఫరెంట్ స్టైల్ లో కమెడియన్ గా నవ్వించడమే కాకుండా సీరియస్ లుక్ లో కూడా రవిబాబు బయపెడుతూ ఉంటాడు. ఈ మల్టీటాలెంటెడ్ యాక్టర్ దర్శకుడిగా కొన్ని సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే అందుకున్నాడు. ముఖ్యంగా అప్పట్లో థ్రిల్లర్ సినిమాలతో ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకున్నారు. భూమికతో చేసిన అనసూయా ఆయనకు మంచి క్రేజ్ అందించింది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఒకసారి హీరోయిన్ భూమిక కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని

ఆమె వల్ల నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది కలిగినట్లు చెబుతూ.. దాదాపు పరువు పోయినంత పని అయ్యిందని రవిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. భూమికతో 2007లో రవిబాబు అనసూయ అనే త్రిల్లర్ సినిమాను చేశాడు. అయితే ఆ సినిమాలో పాత్ర కోసమని రవిబాబు గుండుతో అలాగే కనుబొమ్మలపై వెంట్రుకలు కూడా లేకుండా కనిపించాడు. అయితే షూటింగ్ రేపు స్టార్ట్ అవుతోందని అనుకున్న సమయంలో అలాంటి లుక్కుతో సిద్ధంకాగా ఊహించని విదంగా భూమిక ఆరోగ్యం బాగోలేదని ముంబై వెళ్లిపోయింది.

40రోజుల వరకు రాలేదు. దీంతో షూటింగ్ వాయిదా వేయడం వల్ల బయట తిరగలేక సతమతమయ్యాను. క్యాప్, గ్లాసెస్ కొన్నాళ్ళు మ్యానేజ్ చేశాను. భూమిక ఒక్కరోజు ముందే ఆ విషయం చెప్పి ఉంటే అలా జరిగి ఉండేది కాదని రవిబాబు వివరణ ఇచ్చారు.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus