Shankar: ‘భారతీయుడు 3’ వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన శంకర్‌.. ఎప్పుడంటే?

కొన్ని సినిమాలకు సీక్వెల్‌ రావడం కష్టం, సీక్వెల్‌ చేయడమూ కష్టం, సీక్వెల్ తేవడమూ కష్టమూ అని తెలిసినా.. ఆ సినిమాలకు మరో పార్టు వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇండియన్‌ సినిమాలో అలాంటి సినిమాలు తీసిన దర్శకుల్లో శంకర్‌ (Shankar)  ఒకరు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అలాంటివి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ‘భారతీయుడు’ సీక్వెల్స్‌ (Bharateeyudu 2)  పనిలో ఉన్న నేపథ్యంలో ఆ సీక్వెల్స్‌ గురించి అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

‘భారతయుడు’ సినిమా విడుదలైన 28 ఏళ్ల సీక్వెల్‌ వస్తోంది కదా.. మరి మీ ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ (Sivaji)  సినిమాలకు సీక్వెల్‌ ఉంటుందా? అని అడిగితే.. ఆ సినిమాలకు పార్ట్ 2లు తెరకెక్కించాలని నాకూ నాకూ అనిపించిందని, నామమాత్రంగా ఆ సినిమాలు తీయకూడదని అనుకోవడం వల్లే తీయలేదు అని చెప్పారు. అయితే సమయం వచ్చినప్పుడు బలమైన కథలతో ఆ సినిమాలను తెరకెక్కిస్తానని చెప్పారు శంకర్‌.

‘భారతీయుడు’ సినిమా తర్వాత వేరే ప్రాజెక్టులతో బిజీ అయ్యానని చెప్పిన శంకర్‌.. ఆ సినిమా వచ్చాక, అంత ప్రభావం చూపించాక కూడా లంచం గురించి వార్తలు ఇంకా రావడాన్ని గమనించానని చెప్పారు. చెప్పాలనుకున్న విషయాన్ని ‘భారతీయుడు’ సినిమాలోనే చెప్పేశామని, ఇప్పుడు సీక్వెల్‌ అవసరమా అని కూడా అనుకున్నారట. ఆ సందేహంలోనే సంవత్సరాలు గడిచిపోయాయని, అయితే అవినీతి ఇంకా అలానే ఉందని అర్థమయై రెండో ‘భారతీయుడు’ సిద్ధం చేశానని చెప్పారు.

ఒక రాష్ట్రంలో జరిగే కథతో ‘భారతీయుడు 1’ సినిమా తెరకెక్కించామని చెప్పిన శంకర్‌.. రెండో పార్టులో వివిధ రాష్ట్రాల్లో జరిగే కథగా సినిమాను చూపించబోతున్నారట. ఈ క్రమంలో నిడివి పెరిగినా.. ఎడిటింగ్‌లో ఒక్క సీన్‌నూ తీసేయడానికి అంగీకరించలేదని చెప్పారు. అందుకే సినిమాను రెండు భాగాలుగా చేసి ‘భారతీయుడు 3’ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. మరో ఆరు నెలల్లో ‘భారతీయుడు 3’ సినిమాను విడుదల చేస్తామన్నారు. ఆ సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంది అని అన్నారు. అంటే అందులో సేనాపతి తండ్రి కనిపిస్తారన్నమాట. వాటికీ సీక్వెల్‌..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus