Sai Rajesh: బేబీ మూవీ ఆ వ్యక్తి కథతో తెరకెక్కిందా.. అసలేం జరిగిందంటే?

సాయి రాజేశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన బేబీ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజే 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ సమయానికి బ్రేక్ ఈవెన్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైష్ణవి చైతన్యకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి.

సాయి రాజేశ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించి ఎంతో బాధను అనుభవించానని ఇప్పుడు కూడా ఆ ప్రేమ తాలూకు బాధ గుర్తుందని అన్నారు. ఆ బాధను ఒక రోల్ తో స్క్రీన్ పై తీసుకురావాలని బేబీ రాశానని ఆయన పేర్కొన్నారు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథను రాయడం జరిగిందని నా ఫస్ట్ లవ్ నా భార్యనే అని సాయి రాజేశ్ వెల్లడించారు. కథకు అవసరం కాబట్టి కొన్ని డైలాగ్స్ ను, పదాలను వాడామని ఆయన కామెంట్లు చేశారు.

మార్కెటింగ్ స్ట్రాటజీకి అనుగుణంగా బేబీ టైటిల్ పెట్టానని (Sai Rajesh) సాయి రాజేశ్ వెల్లడించారు. చిన్న టైటిల్స్ ప్రేక్షకుల మదిలోకి త్వరగా వెళ్తాయని ఆయన అన్నారు. నిడివి తగ్గించి ఉంటే హీరోయిన్ రోల్ మైనస్ అయ్యేదని కలెక్షన్లు తగ్గినా పరవాలేదని వైష్ణవి పాత్రను తప్పుగా చూపించకూడదని నిడివి తగ్గించలేదని సాయి రాజేశ్ అన్నారు. లెంగ్త్ సరిపోకపోవడం వల్ల విరాజ్ పాత్రకు న్యాయం చేయలేకపోయానని ఆయన తెలిపారు.

ఇతర పాత్రలకు సంబంధించి చాలా పాయింట్స్ మిస్ అయ్యాయని అందుకే వివాదాలు చెలరేగుతున్నాయని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఈ మూవీ కథ విన్న సమయంలో సవాలుగా భావించానని డైరెక్టర్ చెప్పినట్టు నటించానని అన్నారు. యువత నుంచి వస్తున్న రెస్పాన్స్ విషయంలో సంతోషంగా ఉన్నానని ఆనంద్ కామెంట్లు చేశారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus