Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

దర్శకుడు శైలేష్ కొలను.. పరిచయం అవసరం లేని పేరు. ‘హిట్’ ‘హిట్ 2’ ‘హిట్ 3’ వంటి సూపర్ హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా మరో 4 సినిమాలు కూడా వస్తాయని ప్రకటించి ఆసక్తి రేపాడు. మధ్యలో ‘సైందవ్’ సినిమా వచ్చింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో శైలేష్ దర్శకత్వ ప్రతిభపై అనుమానాలు ఏర్పడ్డాయి. ‘హిట్ 3’ హిట్టయినా దాని క్రెడిట్ అంతా నానికే వెళ్ళిపోయింది.

Sailesh Kolanu

డైరెక్టర్ గా శైలేష్ పేరు పడినప్పటికీ.. వెనుక కథ మొత్తం నడిపించింది నానినే అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ‘హిట్ 3’ తో శైలేష్ పూర్తిగా గట్టెక్కినట్టు కాదు అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. శైలేష్ తన నెక్స్ట్ సినిమాని శ్రీకాంత్ కొడుకు రోషన్ తో చేయబోతున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.ఇది పక్కా కామెడీ మూవీగా రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక రకంగా అందరికీ షాకిచ్చే అంశమే.

శైలేష్ శైలికి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది అని ముందు నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. ఫైనల్ గా అదే నిజమవ్వనుంది. వాస్తవానికి ‘సైందవ్’ తర్వాత శైలేష్.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లోనే సినిమా చేయాలి. కానీ నాని నుండి పిలుపు రావడంతో వెళ్లి ‘హిట్ 3’ చేసొచ్చాడు. శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ కి సాఫ్ట్ ఇమేజ్ ఉంది. కాబట్టి.. శైలేష్ పంధా మార్చుకుని ఈ సినిమా స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus