Sandeep Reddy Vanga: హీరోయిన్స్ విషయంలో త్రివిక్రమ్ తీరుపై స్పందించిన సందీప్!

తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు ఈయన అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించి రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కూడా కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇలా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పాగా వేసినటువంటి సందీప్ రెడ్డి త్వరలోనే యానిమల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం బాలయ్య టాక్ షో కి హాజరై సందడి చేశారు ఇందులో భాగంగా బాలకృష్ణ పెద్ద ఎత్తున వీరిని ప్రశ్నిస్తూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ డైరెక్టర్ సందీప్ రెడ్డిని ప్రశ్నిస్తూ నేను కొంతమంది డైరెక్టర్ల పేరు చెబుతాను వారిలో మీకు నచ్చే అంశం నచ్చని అంశం చెప్పాలి అంటూ తెలిపారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పడంతో త్రివిక్రమ్ గురించి సందీప్ రెడ్డి మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైలాగ్స్ చాలా గొప్పగా రాస్తారని నా దృష్టిలో ఆయన కంటే డైలాగ్స్ గొప్పగా రాస్తే వాళ్ళు ఇండియాలోనే లేరు అంటూ తెలియజేశారు. ఈ విషయంలో ఆయన నాకు చాలా బాగా నచ్చుతారని సందీప్ రెడ్డి తెలిపారు. ఇక త్రివిక్రమ్ గారిలో నచ్చని విషయానికి వస్తే ఆయన హీరోయిన్స్ విషయంలో వ్యవహరించే తీరు నచ్చదని తెలిపారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సినిమాకు ఇద్దరు హీరోయిన్ తీసుకుంటారు. అయితే ఆ హీరోయిన్ల పాత్రను చాలా తక్కువ చేసి చూపిస్తారని, ఆ విషయం నాకు నచ్చదు అంటూ సందీప్ రెడ్డి తెలిపారు. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus