Ravi Teja: రవితేజ కారణంగానే సినిమా వాయిదా పడిందా..? ఇదిగో క్లారిటీ!

మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ గత నెల 17న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. రవితేజకి నిర్మాత పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదని, అందుకే ఆయన చివరి షెడ్యూల్ షూటింగ్ కు హాజరు కావట్లేదని.. ఆ కారణంగానే సినిమా వాయిదా పడిందని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో కొన్నాళ్లపాటు ప్రమోషన్స్ కూడా ఆగిపోయాయి. రీసెంట్ గా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

జూలై నెలాఖరులో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అలాగే సినిమా నుంచి ‘నా పేరు సీసా’ అనే కొత్త పాటను కూడా లాంచ్ చేశారు. రవితేజకి బ్యాలెన్స్ ఉన్న రెమ్యునరేషన్ క్లియర్ చేసిన తరువాతే సినిమా ముందుకు కదిలిందనే ప్రచారం జరిగింది. ఇలా ఈ సినిమాకి సంబంధించి చాలా వార్తలు మీడియాలో వినిపించాయి. ఈ రెండు ప్రచారాల గురించి దర్శకుడు శరత్ మండవ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

తమ సినిమా గురించి మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కూడా ఈ వార్తలను కొందరు ఫార్వార్డ్ చేశారని.. అయితే ఎవరైనా వీటి గురించి తనను వివరణ అడిగి ఉంటే నిజం చెప్పేవాడినని.. తన పనిలో తాను బిజీగా ఉండేదంతో ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేకపోయానని శరత్ తెలిపారు. గతంలో సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆగడానికి కారణం షెడ్యూల్ మారడమేనని అన్నారు. ముందు ఫారెన్ లో అనుకున్న పాట షూటింగ్ ను కోవిడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ కి మార్చామని..

కానీ తరువాత ఫారెన్ లో పరిస్థితి మెరుగుపడడంతో ఇక్కడ క్యాన్సిల్ చేసి అక్కడికే వెళ్లాలనుకున్నామని.. ఈ క్రమంలో పర్మిషన్స్ కోసం కొంత సమయం ఎదురుచూడాల్సి వచ్చిందని శరత్ అన్నారు. రెండు పాటలు, టాకీ పార్ట్ కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న కారణంగానే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతకుమించి ఎలాంటి వివాదాలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus