Adipurush: ఆ ఒక్క సీటు ఆ డైరెక్టర్ కి వదిలేయాలట..!

ఆదిపురుష్ టీం ఇటీవల ఓ గొప్ప నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేంటి అంటే.. ఆదిపురుష్ థియేట‌ర్లోని టికెట్ల‌న్నీ అమ్మినా.. ఒక్క టికెట్ మాత్రం అమ్మకుండా వదిలేస్తారు. ఆ ఒక్క టిక్కెట్ హ‌నుమంతుడి కోసం వదిలేస్తారట. రామాయ‌ణ పారాయ‌ణం ఎక్క‌డ జ‌రుగుతున్నా.. అక్క‌డికి హ‌నుమంతుడు వ‌స్తాడ‌న్న‌ది హిందువుల న‌మ్మ‌కం. అందుకే ఆ ఒక్క సీటు హనుమంతుడి కోసం ఉంచేస్తారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు లేదా సినిమాకి వచ్చినప్పుడు,సినిమా అయిపోయాక వెళ్ళినప్పుడు ఆ ఒక్క సీటు వైపుకే చూస్తుంటారు.

ఆదిపురుష్ (Adipurush) మైథలాజికల్ మూవీ కాబట్టి.. ఈ నిర్ణయం సరైనదే అని అంతా అంటున్నారు. పబ్లిసిటీకి కూడా ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. గతంలో ఇతను రైటర్ గా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సినిమాలకి రైటర్ గా పనిచేశాడు. తర్వాత దర్శకుడిగా మారి ‘బుర్రకథ’ ‘సన్ ఆఫ్ ఇండియా’ వంటి సినిమాలు తీశాడు. జూన్ 9న ‘అన్ స్టాపబుల్’ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

‘బిగ్ బాస్ 5’ విన్నర్ వి జె సన్నీ, సప్తగిరి ఈ సినిమాలో హీరోలుగా నటించారు. ఇక ప్రమోషన్లలో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మా ‘అన్ స్టాపబుల్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది ఇవివి గారి స్టైల్ లో ఉంది అని అంటున్నారు.

కాబట్టి మా ‘అన్ స్టాపబుల్’ థియేటర్స్ లో ఒక సీటు ఇవివి గారికి వదిలేస్తాం’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు.. ‘నీ సినిమాకి ఫస్ట్ షో హౌస్ ఫుల్ అవుతుందనుకుంటున్నావా?’ అంటూ మండిపడుతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus