సినిమాల్లో మాత్రమే కాదు .. నిజ జీవితంలోనూ హీరోలంటారు అని ఈ కోవిడ్ టైములో అందరికీ తెలిసొచ్చింది. ఎటువంటి విపత్తు సంభవించినా.. మొదటిగా స్పందించేది సినీ పరిశ్రమే అని కూడా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.నిజమే అని ఇప్పుడు అంతా ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా… ఇప్పుడు మన దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా రియల్ హీరోస్ లిస్ట్ లో చేరారు. కోవిడ్ టైములో కూడా పలువురికి తన వంతు సాయం చేసాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. తాజాగా మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నాడు నెటిజెన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన ఓ రైతుకి ఆర్థిక సాయం చేశారు శేఖర్ కమ్ముల. ఓ ఛానెల్‌లో వచ్చిన కథనం పై వెంటనే స్పందించి సాయం చేసారు శేఖర్ కమ్ముల.ఈ కథనం విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా మునగాల మండంలోని నేల మర్రి గ్రామానికి చెందిన రైతు లక్ష్మయ్య.. తన వ్యవసాయ భూమిని అమ్ముకున్నాడు. అందుకు గాను అతనికి రూ.10 లక్షలు వచ్చాయి. అప్పులు రూ.4 లక్షల వరకు క్లియర్ చేయగా అతనికి 6 లక్షలు మిగిలాయి.
ఆ డబ్బును బీరువాలో దాచుకుంటే… అనుకోకుండా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ వల్ల అగ్ని ప్రమాదం జరగడంతో.. అతని ఇల్లు కాలిపోయింది. అతను దాచుకున్న డబ్బు కూడా కాలిపోయింది. తన సొంత ఇంటి కోసం లక్ష్మయ్య ఆ డబ్బుని దాచుకున్నాడు… అది కాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అతను ఏమి చేయలేకపోయాడు.ఈ విషయాన్ని సదరు ఛానెల్ ద్వారా తెలుసుకున్న శేఖర్ కమ్ముల… లక్ష్మయ్య బ్యాంక్ ఖాతాకి తన వంతుగా రూ.1 లక్ష వరకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. శేఖర్ కమ్ములని ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది సినీ ప్రముఖులు ముందుకొస్తారేమో చూడాలి..!
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?