యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న నాగశౌర్య 20వ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఏషియన్ గ్రూప్స్ చైర్మన్, తెలుగు ఫిలింఛాంబర్ ప్రసిడెంట్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి అధినేత శ్రీ నారయణదాస్ కె. నారంగ్ పుట్టినరోజు సందర్భంగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు.
సూపర్ ఫిట్ గా వెనుకనుండి కనిపిస్తున్న నాగశౌర్య20 ప్రీ లుక్ విశేష స్పందన రాబట్టి ఫస్ట్ లుక్ మీద అంచనాలు పెంచిన విషయం తెలిసిందే..ఆ అంచనాలను అందుకునేలా ఫస్ట్‌లుక్‌ని డిజైన్ చేసింది చిత్ర యూనిట్. మెలితిరిగిన కండలతో చేతిలో బాణం పట్టుకుని వారియర్ పోజ్ లో ఉన్న ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సరికొత్తగా కనిపిస్తోన్న హీరో నాగశౌర్య లుక్ సూపర్బ్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి సినిమాలో తన స్పెషాలిటీని నిరూపించుకుంటూ ఛలో, ఓ బేబీ, అశ్వథ్థామ వంటి సూపర్ హిట్స్‌తో దూసుకెళ్తున్నయంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.
నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో వారియర్ పోజ్ లో నిల్చొని ఉన్న ఫస్ట్‌లుక్ చాలా బాగుంది.
సక్సెస్‌ఫుల్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – సిక్స్ ప్యాక్ బాడీతో వారియర్ పోజ్ లో నిల్చొని ఉన్న నాగశౌర్య20 ఫస్ట్‌లుక్ చాలా బాగుంది. బరువు పెరగడం ఎంత కష్టమో నాకు తెలుసు అలాంటిది అమేజింగ్ కమిట్‌మెంట్ తో నాగశౌర్య తన లుక్‌ని మార్చుకున్నందుకు ఆయనను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. నాగశౌర్య సినిమాల్లో ఒక హాట్ కేక్‌లా ఈ సినిమా ఉండబోతుంది అనిపిస్తోంది. బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్లు చేస్తూ కూల్‌గాయ్ ఇమేజ్‌నుంచి మాస్ ఇమేజ్‌కి మారడం రైట్ చాయిస్ అనుకుంటున్నాను. నేను చలో, ఓ బేబి సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో నాగశౌర్య నటన నాకు నచ్చింది. అలాగే తను ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాతలు నారయణదాస్, రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ గారికి నా తరపున ఆల్ ది బెస్ట్. అలాగే ఈ రోజు ఇంకొక కోఇన్స్‌డెంట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ నారయణదాస్ కె. నారంగ్ గారి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నారంగ్ గారు ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో విధాలుగా సేవ చేస్తూ వస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా టీమ్ అందరినీ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుంది అని నమ్ముతున్నాను. ఈ కరోనా క్రైసిస్ సమయంలో మనం అందరం సేఫ్‌గా ఉందాం. కరోనాపై కలిసికట్టుగా పోరాడుదాం“ అన్నారు.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?