టాలీవుడ్ లో అసలు పవన్ కల్యాణ్ ను మించిన హీరో లేడు అంటారు ఆయన అభిమానులు. అదే క్రమంలో రానున్న రోజుల్లో పవన్ ను మించిన నాయకుడు సైతం ఉండడు అని అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు, ఎందుకంటే అది పవన్ పై వాళ్ళకు ఉన్న పిచ్చి అభిమానం. అయితే పవన్ కల్యాణ్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఆయనపై ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని మాట్లాడారు. అయితే ఏమనుకున్నాడో ఏమో ఒక దర్శకుడు అదీ, పవన్ కు తన కరియర్ లో భారీ హిట్ అందించిన ఒక దర్శకుడు పవన్ పై కొన్ని పవర్‌ఫుల్ కామెంట్స్ చెయ్యడంతో, ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఈ మ్యాటర్ హాట్ హాట్ గా మారి హల్‌చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే అసలు ఆ దర్శకుడు ఎవరు, ఆ కధ ఏంటి అంటే, ఒకసారి ఈ కధ చదవాల్సిందే, అసలు విషయంలోకి వెళితే, పవన్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా అయిన తమ్ముడుకి దర్శకత్వం వహించిన అరుణ్ ప్రసాద్ పవన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పై ఈ కామెంట్స్ చేసాడని తెలుస్తుంది.
అదే క్రమంలో పవన్ కల్యాణ్ కెరియర్ తోలిరోజులకు ఇప్పటికీ ఉన్న తేడా గురించి వివరిస్తూ ప్రస్తుతం పవన్ చుట్టూ ఒక కోటరీ లాంటిది తయారైంది అనీ దానివల్ల ప్రస్తుతం పవన్ చాలామందికి అందుబాటులో లేకుండా పోయాడు అంటూ ఘాటైన కామెంట్స్ అరుణ్ ప్రసాద్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ తమ్ముడు సినిమా టైమ్ లో సింపల్ గా ఉండేవాడు అని, ఇప్పుడు పవన్ పరిస్థితి చాలా డిఫరెంట్ అని చెప్పాడు. అంతేకాకుండా ప్రస్తుతం పవన్ ను ఎవరైనా కలవాలి అంటే చాల దూరంగా ఉండి మాట్లాడవలసిన పరిస్థుతులు ఏర్పాడ్డాయని అందువల్ల చాలామంది ప్రస్తుతం పవన్ ను కలవలేని పరిస్థితి కొనసాగుతోంది అంటూ దీనికి కారణం ఆయన చుట్టూ ఉన్న కోటరీ అని అంటున్నాడు ఈ దర్శకుడు. ఇక పవన్ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తాడు అని అడగగా….పర్సనల్ గా పవన్ చాలా బిడియం ఉన్న వ్యక్తి అని ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు రాజకీయాలకు సరిపోరు అంటూ మరో సంచలన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, పవన్ ని సామాన్యులు కలవడానికి కుదరదు అంటే రేపు పవన్ పొలిటికల్ కింగ్ గా ఎలా ఏదుగుతాడో ఆయనకే తెలియాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.