Shankar: మెగా హీరోలపై ఫోకస్ పెట్టిన శంకర్.. అదిరిపోయే స్టోరీతో?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. వచ్చే నెలలో బ్రో సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న శంకర్ ఈ సినిమా తర్వాత పవన్ తో సినిమా తెరకెక్కించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ భావజాలానికి అనుగుణంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధమైందని త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. మెగా హీరోలపై శంకర్ స్పెషల్ ఫోకస్ పెట్టారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

శంకర్ (Shankar) పవన్ కాంబో మూవీ అంటే మెగా ఫ్యాన్స్ కు ఇంతకు మించిన శుభవార్త ఉండదు. పవన్ శంకర్ కాంబో అంటే బాక్సాఫీస్ వద్ద ఈ కాంబినేషన్ సంచలనాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. శంకర్ తమిళ హీరోల కంటే తెలుగు హీరోలపై ఎక్కువగా దృష్టి పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో శంకర్ తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.

శంకర్ చరణ్ సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే శంకర్ రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. శంకర్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus