Director Shankar: సినిమాల విషయంలో శంకర్‌ షాకింగ్‌ డెసిషన్‌.. నిజమా?

ఒకేసారి సెట్స్‌ మీద రెండు సినిమాలు.. సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా కాన్సెప్ట్‌ ఎక్కువగా హీరోలు, హీరోయిన్ల దగ్గర చూస్తుంటాం. దర్శకుల దగ్గర ఈ స్టైల్ చాలా తక్కువ. ఎప్పుడో గతంలో దర్శకులు ఇలా ఒకేసారి సెట్స్‌పై ఒకటికిమించిన సినిమాలు పెట్టేవారని అంటుంటారు. ఇప్పుడు మళ్లీ ఆ తరహా సీన్‌ చూడబోతున్నామా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. అది కూడా ఏ చిన్న దర్శకుడో కాదు. భారీ చిత్రాల డైరెక్టర్‌ శంకర్‌ ఈ పని చేస్తున్నారని చెబుతున్నారు.

వినడానికి, నమ్మడానికి కాస్త కష్టమే అయినా.. గతంలో అనుకున్న, రాసుకున్న లెక్కల ప్రకారం సినిమా ఒకటి పూర్తి చేయాల్సి వచ్చి శంకర్‌ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. అందులో ఓ పడవ రామ్‌చరణ్‌ సినిమా అయితే, రెండో సినిమా కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’. అదేంటి చరణ్‌ సినిమా అయ్యాక ‘ఇండియన్‌ 2’ అని మొన్నీమధ్య కమల్‌ హాసన్‌ చెప్పారు కదా అంటారా.. అవును అన్నారు కానీ ఇప్పుడు ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

‘ఇండియన్‌ 2’ సినిమా మొదలై చాలా రోజులైంది. ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే కర్ణుడు చావుకి లక్ష కారణాలు అన్నట్లు.. దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ‘విక్రమ్‌’ సినిమా తర్వాత ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చిన కమల్‌ ‘ఇండియన్‌ 2’ను రీస్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నారు. అయితే శంకర్‌ ఇప్పుడు ఖాళీగా లేరు. రామ్‌చరణ్‌ – దిల్‌ రాజు సినిమా చేస్తున్నారు. దీంతో అదయ్యాక ఇదీ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రెండూ ఒకేసారి అని అంటున్నారు.

కొన్ని రోజుల పాటు చరణ్‌ సినిమాకు కామా పెట్టి.. ‘ఇండియన్‌ 2’ సంగతి చూద్దాం అని కమల్‌ హాసన్‌ అన్నారని టాక్‌ వినిపిస్తోంది. ఆ తర్వాత చరణ్‌ సినిమాకు నెలలో పది రోజులు, కమల్‌ సినిమాకు 15 రోజులు లెక్కన కేటాయించాలని అనుకుంటున్నారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఇది జరిగితే శంకర్‌ ఎంతవరకు డబుల్‌ ప్రాజెక్ట్స్‌ బాగా హ్యాండిల్‌ చేస్తారు అనేది చూడాలి. మామూలుగానే శంకర్‌ తన సినిమాను శిల్పంలా చెక్కుతారు. దీనికి టైమ్‌ ఎక్కువ తీసుకుంటారు. మరి ఒకేసారి రెండు సినిమాలంటే?

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus