Baby Movie Controversy: ‘బేబీ’ కథ ఎవరిది? సాక్ష్యాలతో బయటపెట్టిన యువ రచయిత.. పూర్తి సాక్ష్యాలతో…

  • May 26, 2024 / 09:53 PM IST

ఏదైనా ఓ పెద్ద సినిమా తెరకెక్కినప్పుడు, లేదంటే ఏదైనా చిన్న సినిమా వచ్చి పెద్ద విజయం అందుకున్నప్పుడు ‘ఆ సినిమా కథ నాదే’ అంటూ కొంతమంది వస్తుంటారు. అయితే ఇలాంటి క్లెయిమ్స్‌లో చాలా తక్కువ శాతం సక్సెస్‌ అవుతుంటాయి. మరికొన్ని అటు ఇటుగా ఉంటే నిర్మాతలు, ఆ కథ ఒరిజినల్‌ రచయిత అని చెప్పుకునే వారి మధ్య సయోధ్య కుదురుస్తుంటారు. అయితే ఒక సినిమా కథ నాదే అని అంటూ ఓ రచయిత ఏకంగా పుస్తకరం రాసేశారు అంటే.. ఆస్తక్తికరమే కదా.

అదే జరిగింది.. ఇప్పుడు టాలీవుడ్‌లో. సాయి రాజేష్ తీసిన ‘బేబీ’ సినిమా మీద ఎన్ని రకాల విమర్శలు వచ్చాయో మీకు గుర్తుండే ఉంది. సినిమా పోస్టర్‌ నుండి, సినిమాలో హీరోయిన్‌ను చూపించే విధానం వరకు అన్ని విషయాల్లో ఇబ్బందిపడ్డారు. అయితే ఫైనల్‌గా ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ కథకు ఇన్‌స్పిరేషన్… ఎక్కడో తమిళనాడులో జరిగిన వార్త అని సాయి రాజేశ్‌ చెప్పారు. కానీ ‘బేబీ’ కథ తనదని, తాను రాసుకున్న ‘కన్నా ప్లీజ్’ అనే కథను కాపీ కొట్టారని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్‌ ఆరోపిస్తున్నారు.

‘బేబీ’ సినిమా వచ్చి ఏడాది అయిన తరువాత అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు చేశారు. దాని కోసం ఏకంగా ఓ బ్లాగ్‌, బుక్‌, వీడియోలు రూపొందించారు. ఈ ఏడాదిలో తన ఆరోపణలకు కావాల్సిన ఆధారాలు, సాక్ష్యాల్ని సేకరించానని శిరిన్‌ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సుదీర్ఘంగా ఎప్పుడు ఏం జరిగింది అనే విషయాల్ని మెయిల్స్‌, స్క్రీన్‌షాట్లు, ఫొటోలతో ఆ బ్లాగ్‌లో వివరించారు. సాయి రాజేష్ ‘బేబీ’ కోసం తన కథను కాపీ కొట్టారని ఆరోపించిన శిరిన్‌.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించిన అమ్మాయిని..

ఆ ఇద్దరూ కలిసి చంపేందుకు ప్రయత్నించడం అనే పాయింట్‌‌ తాను తొలుత సాయి రాజేశ్‌కి చెప్పానని, సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తానని ఆయన చెప్పారని తెలిపారు. ఎస్‌కేఎన్‌ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి అవుతారని తర్వాత చెప్పారని శిరీన్‌ పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్‌ నుండి జీఏ2 అనే నిర్మాణ సంస్థ వస్తుందని, అందులో చేద్దాం అని అన్నారని కూడా ఆ బ్లాగ్‌లో రాశారు. కానీ తన కథకు అచ్చు గుద్దినట్లుగా కాస్త బూతు ఎలిమెంట్స్‌ కలిపి ‘బేబీ’ చేశారని శిరిన్‌ ఆరోపించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus