Shiva Nirvana: క్రేజీ మల్టీస్టారర్ కి శివ నిర్వాణ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కిన ‘నిన్ను కోరి’ (Ninnu Kori) చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శివ నిర్వాణ (Shiva Nirvana) . ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎమోషనల్ కూడా చాలా మందికి కనెక్ట్ అయ్యింది. దాని తర్వాత నాగ చైతన్య (Naga Chaitanya)- సమంత (Samantha) ..లతో చేసిన ‘మజిలీ’ (Majili) కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఆ తర్వాత నానితో ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) అనే మాస్ సినిమా చేశాడు శివ నిర్వాణ. అది కోవిడ్ వల్ల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

Shiva Nirvana

అయినా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో మాస్ రూటు ఎందుకులే అని భావించి ‘ఖుషి’ (Kushi) అనే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ చేశాడు శివ నిర్వాణ.ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. యావరేజ్ ఫలితంతోనే సరిపెట్టుకుంది. ‘ఖుషి’ రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు శివ నిర్వాణ. నాగ చైతన్యతో ఓ సినిమా అనుకున్నాడు. కానీ ఇప్పట్లో అది సెట్ అయ్యేలా కనిపించడం లేదు.

దీంతో ఓ ఫ్యామిలీ మూవీకి సెట్ అయ్యే కథ డిజైన్ చేసుకున్నాడట శివ నిర్వాణ. ఇటీవల సూర్య (Suriya)  – కార్తీ (Karthi) ..లని కలిసి ఈ కథ చెప్పాడు. ఇది మల్టీస్టారర్ కథ. వాళ్లకి ఇది నచ్చిందట.’మైత్రి మూవీ మేకర్స్’ వాళ్ళకి శివ నిర్వాణ ఓ సినిమా చేయాలి. వాళ్ళకి ఈ కథ గురించి చెప్పగా.. ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ క్రేజీ మల్టీస్టారర్ మొదలవుతుంది. తెలుగు,తమిళ భాషల్లో బై-లింగ్యువల్ మూవీగా దీనిని మలచాలని దర్శకుడు శివ నిర్వాణ ప్లాన్.

ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్.. సగంలో సగం కూడా రాలేదుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus