కాలేజీ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చూస్తే… కాలేజీ డేస్ గుర్తుకురావడం సహజం. కానీ సినిమా ట్రైలర్ చూస్తేనే అలాంటి రోజులు కళ్ల ముందు కదలాడుతున్నాయి అంటే… ఆ సినిమాలో యూత్‌ను బాగా ఆకట్టుకునే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అలాంటి ఫీల్ రీసెంట్ డేస్‌లో కలిగించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. సినిమా ట్రైలర్‌లో ఎక్కువ శాతం కాలేజీ కుర్రాళ్లు చేసే అల్లరి, సందడి కనిపిస్తోంది. అయితే ఇదంతా తన జీవితంలో జరిగింది, తాను చూసిందే అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి.
18 ఏళ్ల వయసున్నప్పుడు ప్రతి కుర్రాడికీ పరిణతి ఉండదు. ఆ సమయంలో చాలా వైల్డ్‌గా ఉంటారు. తెలిసీ తెలియక తప్పులు చేస్తుంటారు. కానీ ఓ వయసొచ్చాక వెనక్కి తిరిగి చూస్తే… ‘‘ఏంటీ… మనం ఇన్ని అల్లరి పనులు చేశామా?’’ అనిపిస్తుంది. మనలో చాలామందికి ఇలా అనిపించే ఉంటుంది. అలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపిస్తాం. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వాళ్ల పాత రోజులు గుర్తొస్తాయి. అంతలా లైవ్‌లీగా ఉంటుందీ సినిమా. ఇలానే నా కాలేజీ డేస్‌లో జరిగింది అని అనుకుంటారు ప్రేక్షకులు అని అన్నారు శ్రీహర్ష.
ఈ సినిమాను చాలామంది ‘ప్రేమదేశం’తో పోలుస్తున్నారు. అయితే దానికీ, ఈ సినిమాకీ ఎలాంటి పోలిక ఉండదు అంటున్నారు శ్రీహర్ష. కాలేజీ రోజుల్లో అతని నిజ జీవితంలోని ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారట. సినిమాలో చూపించినట్లుగానే వాళ్ల కాలేజీలో ఓవైపు ఇంజనీరింగ్ క్యాంపస్.. మరోవైపు మెడికల్ క్యాంపస్ ఉండేదట. సినిమాలో కనిపించే గ్యాంగ్‌ల సందడి, స్టూడెంట్స్ అల్లర్లు వాళ్ల కాలేజీ రోజుల్లో చూసినవేనట. వాటినే వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారట.
‘హ్యాపీడేస్’ సినిమాలోని పాత్రల తరహాలో ఇందులో క్యారెక్టర్స్ ఉంటాయట. వారి చుట్టూనే కథ సాగుతుందట. ఇలాంటి కాలేజీ నేపథ్య చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదంటున్నారు శ్రీహర్ష. అబ్బాయిలకు మాత్రమే కాకుండా అమ్మాయిలకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందట. సెకండాఫ్‌లో అమ్మాయిలను హైలైట్ చేస్తూ తీశారట. అయితే శ్రీహర్ష చెప్పిన కాలేజీ ఏంటి, అక్కడలా జరిగిందా అనేది తెలియదు. సినిమా వచ్చాక ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!