SS Rajamouli: కల్కి 2898 ad ప్రపంచం అద్భుతమంటున్న రాజమౌళి.. !

ప్రభాస్ నటించిన కల్కి 2898 ad (Kalki 2898 AD) సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా ఉంది అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో రాజమౌళి కూడా చేరాడు. రాజమౌళి (Rajamouli) తన ట్విట్టర్ ద్వారా కల్కిపై స్పందిస్తూ… ” ‘కల్కి 2898 ad’ వరల్డ్ నాకు బాగా నచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతమైన టేకింగ్ నిజంగా అదిరిపోయింది.

ప్రభాస్ టైమింగ్ కూడా అదిరిపోయింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే.. ల సపోర్టింగ్ రోల్స్ ని ఎంత పొగిడినా తక్కువే. చివరి 30 నిమిషాలు అయితే వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) , నిర్మాత అశ్వనీదత్(C. A swani Dutt)  .ల టీం ఎఫర్ట్..ని ఎంత పొగిడినా తక్కువే’ అంటూ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో రాజమౌళి కూడా ఒక చిన్న కేమియో ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో కలిసి ఒక చేజింగ్ సీన్ లో పాల్గొన్నారు రాజమౌళి.

ఆ టైమ్ లో వీరు పలికిన డైలాగ్స్ కూడా సరదాగా అనిపిస్తాయి. ‘ ఈయనకు దొరికితే 5 యేళ్ళు నిలిపేస్తాడు ‘ అంటూ ప్రభాస్ అంటాడు. ఆ తర్వాత రాజమౌళి కూడా ‘ ఈసారి నిన్ను పదేళ్లు వాడతా ‘ అంటూ రాజమౌళి అంటాడు. ఆ డైలాగ్స్ కి ధియోటర్స్ లో నవ్వులు పూశాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus