అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) దర్శకత్వం వహించాడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండా (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ‘బచ్చల మల్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లోని, వెస్టిన్ హోటల్లో ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్లో దర్శకుడు సుబ్బు చేసిన ఎమోషనల్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ.. “ఈ మధ్య నేను ఎక్కువగా మా అమ్మ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ‘బచ్చల మల్లి’ అనే సినిమా.. నేను మా అమ్మకి రాసిన క్షమాపణ లేఖ. నేను నా మూర్ఖత్వంతో చేసిన పొరపాటు.. ఇంకెవ్వరూ చేయకూడదు.నాలా ఇంకెవ్వరూ బాధపడకూడదు అనే ఉద్దేశంతో.. మాత్రమే ఈ సినిమా చేశాను.
నేను చనిపోయాక మా అమ్మ దగ్గరికి వెళ్ళినా ఇదే చెబుతాను” అంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.కోవిడ్ టైంలో దర్శకుడు సుబ్బు వాళ్ళ అమ్మగారు చనిపోయారట. ముందుగా ఒంట్లో బాగోలేదు అని దర్శకుడు సుబ్బుకి చెప్పినా.. అతను మొండితనంతో వెళ్లలేదట. అందువల్ల ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. అందువల్లే సుబ్బు తన పేరును సుబ్బు మంగాదేవిగా మార్చుకున్నాడట.
‘బచ్చల మల్లి’..మా అమ్మకి రాసిన క్షమాపణ లేఖ : దర్శకుడు సుబ్బు#DirectorSubbu #BachhalaMalli #AllariNaresh pic.twitter.com/GfhkcPytrg
— Filmy Focus (@FilmyFocus) December 17, 2024