ఆ కారణంగానే ‘సాహో’ చిత్రం విడుదల డేట్ ను మార్చాం..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘సాహో’. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన్ ఈ చిత్రం టీజర్ సినిమా పై అంచనాల్ని మరింత పెంచేసిందనే చెప్పాలి. తాజాగా ‘సాహో’ దర్శకుడు సుజిత్ ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలిపాడు.

సుజీత్ మాట్లాడుతూ… ” ‘బాహుబలి’ చిత్రం కంటే ముందుగానే ప్రభాస్ కు ఈ కథ చెప్పాను. ‘సాహో’ కథ అప్పుడే రెడీ అయిపోయింది. ‘బాహుబలి’ భారీ విజయం సాధించింది కదా అని ‘సాహో’ కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ చిత్రం ద్వారా నాకంటే అనుభవం ఉన్న టెక్నీషియన్లతో పనిచేసే అవకాశం లభించింది. ‘సాహో’ చిత్రం నాకు పది సినిమాలు తెరకెక్కించిన అనుభూతి కలిగించింది. అంటే పది సినిమాలు తీసినప్పుడు ఓ డైరెక్టర్ కు ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో.. అంత ఎక్స్పీరియన్స్ నాకు ఒక్క ‘సాహో’ చిత్రంతో వచ్చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు మరింత సమయం పడుతుందని భావించి.. ‘సాహో’ ని ఆగష్టు 30కి వాయిదా వేశాం. ఎలాగూ వినాయక చవితి హాలిడేస్ కూడా ఉన్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆగష్టు 30 అయితే బెటర్ అని ఆ డేట్ ని లాక్ చేసాం” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus