సమంతపై నిందలు మోపిన డైరక్టర్ సుకుమార్

డైరక్టర్ సుకుమార్ అటు నాగచైతన్యతో.. ఇటు సమంత తోను సినిమాలు చేశారు. చైతూ కెరీర్ మొదట్లో చేసిన 100 % లవ్ అతనికి మంచి విజయాన్ని ఇచ్చింది. ఇక సమంతకి రంగస్థలం వంటి హిట్ ఇచ్చారు. అటువంటి డైరక్టర్ సమంతపై నిందలు మోపారు. సమంత, చైతు జీవితంలోకి వచ్చాక చైతు తాను కలవలేకపోతున్నట్లు చెప్పారు. చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య చేసిన “సవ్యసాచి” థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ” సవ్యసాచి లాంటి సినిమా నేను చేయనందుకు జెలసీ ఫీలవుతున్నాను. ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ స్క్రీన్‌పై రాలేదు. ఏ దర్శకుడికైనా ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేయాలని ఉంటుంది” అని సుకుమార్ చందు మొండేటి పై అభినందనలు కురిపించారు.

అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన కీరవాణిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక హీరో చైతూ గురించి మాట్లాడుతూ… “100 పర్సెంట్ లవ్ సినిమా తర్వాత చైతూ, నేను తరచూ కలిసేవాళ్ళం. సమంత వచ్చాక మాత్రం అది సాధ్యపడట్లేదు” అని సుకుమార్ నవ్వులు పూయించారు. ఈ చిత్రంలో చైతు అద్భుతంగా నటించాడని.. క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని ఆసక్తిరేకెత్తించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీలో నిధి అగర్వాల్ చైతూతో రొమాన్స్ చేయనుంది. గతంలో హీరోగా హిట్స్ అందుకున్న మాధవన్ ఇందులో విలన్ గా కనిపించనుండగా… గతంలో హీరోయిన్ గా మెప్పించిన భూమిక చైతూకి అక్కగా నటించింది. ప్రీ లుక్ నుంచే ఆసక్తికలిగిస్తున్న ఈ మూవీ నవంబర్ 2 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus