ఫ్యామిలీ, సెలబ్రిటీల మధ్య డైరెక్టర్ సుకుమార్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

తన మేధస్సుతో తెలుగు సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చి, సినిమాను అర్థం చేసుకోవాలనే ఆలోచనను ప్రేక్షకులను వచ్చేలా చేశారు క్రియేటివ్ జీనియస్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. జనవరి 11న సుకుమార్ తన 53వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. 1970 జనవరి 11న జన్మించారాయన. సుకుమార్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు ఆయన సతీమణి తబిత సుకుమార్. తల్లి, పిల్లలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రేమ పూర్వక విషెస్ చెబుతూ భర్త బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు తబిత.. సుకుమార్ సినిమాలకు వెన్నుముకలా నిలిచే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్, మైత్రీ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని తదితరులు సుకుమార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సుక్కుకి విషెస్ చెప్పారు. ప్రస్తుతం సుకుమార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus