స్టార్ డైరెక్టర్ కూతురి లేటెస్ట్ ఫోటోలు వైరల్.. ట్యాలెంట్ బయటపడిందిగా!

టాలీవుడ్ స్టార్లు ఎక్కువగా తమ ఫ్యామిలీ లైఫ్ ని ఎక్స్పోజ్ చేయరు. సాధ్యమైనంత వరకు తమ ఫ్యామిలీని మీడియాకు దూరంగానే ఉంచడానికి ఇష్టపడతారు. కానీ సోషల్ మీడియా వాడకం పెరిగాక.. అందరి లైఫ్ స్టైల్ బయటపడుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూతరు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన తర్వాత చాలా మంది ఏంటి ఆ స్టార్ డైరెక్టర్ కి ఇంత పెద్ద కూతురు ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ అంటే అందరూ చెప్పే పేరు సుకుమార్. అయితే ఆయన ఇటీవల కాలంలో రా అండ్ రస్టిక్ మూవీస్ తీస్తూ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ‘రంగస్థలం’ ‘పుష్ప’ ఈ కోవకి చెందినవే. ఇవి ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారు. మరోపక్క సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే వస్తున్నాడు.

తాజాగా సుకుమార్ (Sukumar) కూతురు సుకృతి వేణి ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల ఆమె పుట్టినరోజు కావడంతో సుకుమార్, తబిత దంపతులు ఆమె ఫోటోలు షేర్ చేశారు. సుకృతి ఆల్రెడీ టీనేజ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈమె ఓ మ్యూజికల్ కోర్స్ కూడా చేస్తుందట. ఈమెకి సింగింగ్ టాలెంట్ ఎక్కువగా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.


‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus