టాలీవుడ్‌లో ప్రతీ సినిమాతో తన మార్క్ చూపించే దర్శకుడు సుకుమార్. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) విజయం తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఐదేళ్ల కష్టం, అంకితభావంతో ‘పుష్ప’ (Pushpa) ప్రాంచైజీని ప్రపంచవ్యాప్తంగా ఓ సెన్సేషన్‌గా మార్చిన సుకుమార్ (Sukumar), ఇప్పుడు శిష్యుడు విశాల్ కాశితో (Kasi Vishal) ‘సెల్ఫిష్’ (Selfish) ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ కూడా సహా నిర్మాణం అందిస్తోంది. అలాగే రాజుగారి రిక్వెస్ట్ మేరకు కొన్ని పనులు సుకుమార్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.
ఆశిష్ (Ashish Reddy) హీరోగా, దిల్ రాజు (Dil Raju) బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో కొంతవరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉండడంతో, సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారని టాక్. లేటెస్ట్ టాక్ ప్రకారం, సుక్కూ ఇప్పుడు ‘సెల్ఫిష్’ స్క్రిప్ట్‌ను రివిజిట్ చేసి, షూటింగ్‌ను గాడిలో పెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.
ఇక నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా కార్తీక్ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రతో రూపొందనున్న ‘NC 24’ పైన కూడా మంచి హైప్ ఉంది. ఈ మిథికల్ థ్రిల్లర్ కథ సుకుమార్‌ను చాలా ఎక్సయిట్ చేయడంతో, స్క్రిప్ట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో రూపొందనున్నది కాబట్టి, సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారని చెబుతున్నారు.
మరోవైపు, రామ్ చరణ్‌తో (Ram Charan) సుకుమార్ కొత్త సినిమా పైనా ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ‘రంగస్థలం’ (Rangasthalam) వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘RC 16’ చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కొంచెం ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ గ్యాప్‌ను సుకుమార్ కొత్త స్క్రిప్ట్లకు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇంత బిజీ షెడ్యూల్ మధ్య, సుకుమార్ కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.