Sukumar: వైరల్ అవుతున్న సుకుమార్ షాకింగ్ పోస్ట్!

సినిమా ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటంతో పాటు ఎంతో కష్టపడి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. వరుస విజయాలు జక్కన్న కెరీర్ లో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కారణమయ్యాయనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని మెజారిటీ స్టార్ హీరోలతో పని చేసిన రాజమౌళి ఆ హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చి ఆ హీరోల కెరీర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.

ఒక్కో సినిమా కోసం మూడేళ్ల సమయం కేటాయించడం దర్శకధీరుడు రాజమౌళికి మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు. సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడే దర్శకధీరుడు రాజమౌళి ఆ కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటూ ఇతర దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజమౌళి సక్సెస్ రేట్ ను చూసి ఇతర డైరెక్టర్లు కూడా షాక్ అవుతున్నారంటే రాజమౌళి ఏ స్థాయికి ఎదిగారో సులువుగా అర్థమవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడంతో

సుకుమార్ రాజమౌళికి శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మీటింగ్ రూమ్ లో దిగిన ఫోటోను సుకుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇన్నిరోజులు నా టీమ్ మీటింగ్ ల సమయంలో ప్రిన్సిపల్ కుర్చీని ఖాళీగా వదిలేశానని అలా చేయడానికి కారణమేంటో ఇప్పుడు అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ కుర్చీ ఎస్.ఎస్.రాజమౌళి కోసమేనని సుకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కుర్చీ ఎప్పటికీ రాజమౌళికి చెందినదేనని భవిష్యత్తులో కూడా ఆ కుర్చీ అలానే ఉంటుందని సుకుమార్ పేర్కొన్నారు. రాజమౌళి అండ్ మూవీ టీంకు అభినందనలు అని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ప్రతిభను ప్రశంసించడం ఇండస్ట్రీలో అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘనత రాజమౌళికే సొంతమైంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus