సినిమా అంటే వ్యాపారం…సినిమా అంటే…దొరికిన కాడికి సంపాదింకుకోవడం, సినిమా అంటే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పోవడం, అయితే సినిమా విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి…అందులో ముఖ్యంగా హీరోల లెక్కలు హీరోకు ఉండగా…హీరోయిన్స్ లెక్కలు హీరోయిన్స్ కు ఉంటాయి…అయితే…హీరోయిన్స్ పై హీరోయిన్స్ తీసుకునే రెమ్యునిరేషన్స్ పై రకరకాల లెక్కలు చెబుతున్నాడు ఒక దర్శకుడు…విషయంలోకి వెళితే….కథానాయికలు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్లు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీలు లేదు అంటున్నాడు ఒక దర్శకుడు…ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే…సురాజ్…విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వం వహించిన ‘ఒక్కడొచ్చాడు’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు.
ఇంకా ఏమన్నాడు అంటే…కోట్ల కొద్దీ పారితోషికం తీసుకుంటున్నది అలా నటించడానికేగా?… కింది క్లాస్ ఆడియన్స్‌ని కథానాయికలు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, ఆనందపరచాలి.. ఒకవేళ కాస్ట్యూమ్ డిజైనర్ కనక కథానాయికలు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్లు కవర్ చేసేలా డిజైన్ చేస్తే… పొడవు తగ్గించమని నిర్మొహమాటంగా చెబుతా.. హీరోయిన్‌కి అసౌకర్యంగా అనిపించినా నాకేమీ సంబంధం లేదు. ఆ డ్రెస్ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా… అంటూ ఘాటుగా విమర్శించాడు ఆ దర్శకుడు…మొత్తానికి హీరోయిన్స్ పై అలా మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో అనేక విమర్శలకు దారితీస్తుంది….దీనిపై హీరోయిన్స్ చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.