Sv Krishna Reddy: బాలయ్య గురించి ఎస్వీ కృష్ణా కృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఈ మధ్య కాలంలో ఈ దర్శకుడు ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం లేదు. అయితే వేర్వేరు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి ఆ ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇతరులను గౌరవించడం మన బాధ్యత అని ఆయన అన్నారు. దర్శకుడిగా ఆ బాధ్యత మనపై మరింత ఎక్కువగా ఉంటుందని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోలతో ఎందుకు సక్సెస్ దక్కలేదనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ చిరంజీవి గారికి నేను కథ కూడా చెప్పడం జరిగిందని తెలిపారు. బాలయ్యకు కథ చెప్పిన సమయంలో ఒక సీన్ మాత్రమే చెప్పానని ఎస్వీ కృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. హెలికాఫ్టర్ షాట్ మాత్రమే చెప్పినా చేసేద్దాం అని బాలయ్య సినిమా చేశారని ఆయన స్పిరిట్, పవర్ వేరు అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

చిరంజీవి గారికి కథ చెబితే ఇంత అడ్వాన్స్డ్ గా మనం చేయగలమా అని అన్నారని ఆయన తెలిపారు. టాప్ హీరో మ్యూజికల్ గా పెద్ద హిట్ అని ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్లు చేశారు. వజ్రం మూవీ ఓకే ఫిల్మ్ అని ఆయన తెలిపారు. భారీ అంచనాల వల్ల సాంప్రదాయం మూవీ అంచనాలను అందుకోలేదని ఆయన అన్నారు. ఆరోజులన్నీ అద్భుతమైన రోజులు అని ఎస్వీ కృష్ణారెడ్డి (Sv Krishna Reddy) పేర్కొన్నారు.

శుభలగ్నం సినిమా చూసి శోభన్ బాబు గారు నన్ను కలిశారని ఆయన తెలిపారు. శోభన్ బాబు కేక్ తెప్పించి ఇచ్చారని ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు. శుభలగ్నం లాంటి సినిమాను ఇప్పటివరకు చూడలేదని ఆయన తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ పరంగా బిజీ కావాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus