దర్శకుడు తేజ (Teja) చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఆయన మాట్లాడే విధానం, ఆలోచనలు అన్నీ భిన్నంగా ఉంటాయి. సినిమాలు డైరెక్ట్ చేసే టైంలో ఈయన పని రాక్షసుడిలా కనిపిస్తాడు. చాలా మంది నటీనటులపై తేజ చేయి చేసుకునేవారు అనే కామెంట్స్ కూడా వినపడ్డాయి. కానీ వాటిని ఆయన తోసిపుచ్చింది ఏమీ లేదు. ‘ నేను టార్చర్ పెడతా’ అని ఓపెన్ గానే చెప్పారు. తేజ వల్ల స్టార్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
గోపీచంద్ (Gopichand), నితిన్ (Nithin Kumar),కాజల్ (Kajal Aggarwal).. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది.’తేజ అలా ఉండటం వల్లనే.. మేము స్టార్లు అయ్యాం’ అని వీళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే తేజ టాలెంట్ లేకుండా ఎవ్వరినీ సెలెక్ట్ చేసుకోరు. అందానికి ఈయన ప్రాముఖ్యత ఇవ్వరు. ‘నువ్వు నేను’ (Nuvvu Nenu) హీరోయిన్ అనిత (Anita Hassanandani) విషయంలో ఈయన తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే. ‘ వాస్తవానికి ఆ సినిమాకి చాలా మంది అమ్మాయిలని ఆడియన్స్ చేశారు తేజ. ఒక అమ్మాయి ‘నేను చాలా అందంగా ఉన్నాను.
నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు?’ అని అడిగితే. అనితని చూపించి ఈ అమ్మాయి నా హీరోయిన్ అని చెప్పారట తేజ. అందుకు ఆ అందంగా ఉన్న అమ్మాయి.. ‘ఈమె అందంగా లేదు హీరోయిన్ గా ఎలా సెట్ అవుతుంది?’ అంటూ వక్రీకరిస్తే.. ‘నా సినిమాలో హీరోయిన్ పాలు అమ్ముకునే అమ్మాయి. హీరో ఫాదర్ తో కూడా అందంగా లేదు. దీనిని ఎలా ప్రేమించావు’ అనే డైలాగ్ హీరోతో చెప్పిస్తా సరిపోతుంది’ అని చెప్పారట. ఆయన చెప్పినట్టే ఆ సినిమాతో అనిత స్టార్ అయిపోయింది.
అయితే తేజ.. ఇలియానా (Ileana) వంటి అమ్మాయిని కూడా రిజెక్ట్ చేయడం అందరికీ షాకిచ్చింది. ‘ధైర్యం’ (Dhairyam) సినిమా కోసం ముంబై నుండి కొంతమంది మోడల్స్ ని, అక్కడి చిన్న హీరోయిన్లని తేజ ఆడిషన్ చేశారట. దానికి ఇలియానా కూడా హాజరైంది. కానీ అందులో ఆమెను కాదని రైమా సేన్ ని (Raima Sen) హీరోయిన్ గా పెట్టుకున్నారు. అయితే ఇలియానా టాలెంట్ ని వై.వి.ఎస్ చౌదరి (Y. V. S. Chowdary) గుర్తించి ‘దేవదాసు’ తో (Devadasu) ఛాన్స్ ఇవ్వడం జరిగింది.