2000 వ సంవత్సరంలో మే 25 న ‘చిత్రం’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్. మొదటి చిత్రంతోనే సూపర్ సూపర్ హిట్టు కొట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తరువాత వచ్చిన ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టడమే కాదు టాలీవుడ్ బాక్సాఫీస్ నే షాక్ చేసాడు ఉదయ్ కిరణ్. కెరీర్ ప్రారంభంలోనే వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి స్టార్ హీరో ఇమేజ్ కి దగ్గర పడ్డాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి రావడం అంటే మాటలు కాదు. కానీ 2002 సంవత్సరం నుండీ అతని కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే.. 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీని వెనుక అసలు కారణం ఏంటనేది ఎవరికీ తెలీదు. ఎంతో ట్రాజెడీ ఉన్న ఉదయ్ కిరణ్ జీవితాన్ని బయోపిక్ గా తీస్తున్నారని గతంలో ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఆ బయోపిక్ పై … ఉదయ్ కిరణ్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తేజ స్పందించాడు. గతంలో ఉదయ్ కిరణ్ గురించి అన్ని విషయాలు తెలిసిన డైరెక్టర్ తేజ… ఉదయ్ కిరణ్ బయోపిక్ చేస్తే బాగుంటుందని కొందరు కామెంట్స్ చేసారు. తాజగా ఈ విషయం పై తేజ మాట్లాడుతూ.. “ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసి డబ్బులు సంపాదించాలని అనుకోవడం లేదు. ఉదయ్ కిరణ్ జీవితంలో ప్రతి విషయం నాకు తెలుసు. చనిపోవడానికి ముందు తన జీవితంలో పడిన కష్టాలన్నీ చెప్పుకొని బాధపడేవాడు. ఉదయ్ కిరణ్ కష్టాలు, కన్నీళ్ళను క్యాష్ చేసుకోవాలని అస్సలు భావించడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.