స్టార్ డైరెక్టర్ రాజమౌళి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో ఒకరనే సంగతి తెలిసిందే. జక్కన్న తెరకెక్కించిన సినిమాలలో ఎన్నో సినిమాలు రికార్డు క్రియేట్ చేయగా తాజాగా దర్శకుడు తేజ జక్కన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ దర్శకుని సినిమాలు అయినా ఒకే విధంగా ఉంటాయని జక్కన్న సినిమాలు సైతం ఒకే విధంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. రాజమౌళి సినిమాలను అప్పటినుంచి ఇప్పటివరకు చూస్తే ఒక ప్యాట్రన్ లో ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు.
వరుసగా సినిమాలను చూస్తే ఒకే విధంగా అనిపిస్తాయని తేడా ఉండదని (Teja) తేజ చెప్పుకొచ్చారు. రాజమౌళి మాత్రమే కాదని గౌతమ్ మీనన్, మహేంద్రన్ సినిమాలు కూడా ఇదే విధంగా ఉంటాయని తేజ కామెంట్లు చేసారు. అహింస మూవీ ప్రమోషన్లలో భాగంగా తేజ ఈ కామెంట్లు చేశారు. రాజమౌళి వల్ల ఇండియన్ రుపీ వాల్యూ పెరుగుతుందని తేజ పేర్కొన్నారు. అమెరికన్ సినిమాల వల్ల ఆ దేశంలో డాలర్ విలువ పెరిగిందని జక్కన్న హై స్టాండర్డ్స్ లో తీసే ఇండియన్ సినిమాల వల్ల ఇండియన్ రుపీ విలువ కూడా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
జూన్ నెల 2వ తేదీన అహింస మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. రాజమౌళి తర్వాత మూవీ మహేష్ హీరోగా తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వచ్చే ఏడాది జనవరి నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
ఈ సినిమా రికార్డులు క్రియేట్ చెయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి, మహేష్ రెమ్యునరేషన్లు భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు