Teja: ఆగిపోయిందనుకున్న సినిమా ఉందట… డైరక్టర్‌ కూడా మారుతున్నారట!

చిరంజీవి 156వ సినిమా గుర్తుందా? ఇప్పుడు చేస్తున్న సినిమా కాదు, గతంలో చేస్తాను అని చెప్పి అనౌన్స్‌ చేసిన సినిమా. ఇప్పుడు ఆ సినిమా ముచ్చట మళ్లీ బయటకు వచ్చింది. అయితే ఈ సారి కారణం చిరంజీవి కాదు, అప్పుడు ప్రాజెక్ట్ చేస్తాం అనేవాళ్లూ కాదు. పూర్తి కొత్త టీమ్‌ ఇప్పుడు ఆ సినిమాను బయటకు తీసుకొస్తోందట. అవును చిరంజీవి నో చెప్పిన సినిమాను మరో హీరో చేస్తున్నాడు. అయితే అందులో ఒక హీరో మాత్రమే ప్రస్తుతానికి ఫిక్స్‌ అయ్యాడు.

చిరంజీవి తన కెరీర్‌లో 157వ సినిమాగా చేయాల్సిన సినిమాను 156గా మార్చేసుకున్నారు. అయితే తొలుత ఆ స్థానంలో ‘బ్రో డాడీ’ రీమేక్‌ ఉండాలి. కల్యాణ్‌ కృష్ణ కురసాల ఆ సినిమాను డైరెక్ట్‌ చేయాల్సింది. దాదాపు అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక ఆ సినిమాను పక్కనపెట్టేశారు. మెగా ఫ్యామిలీని వరుస రీమేక్‌లు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో చిరు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటారు. ఆ సినిమాలో చిరంజీవితోపాటు మరో కుర్ర హీరో ఉండాలి. ఆ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది.

అయితే ఇప్పుడు కుర్ర హీరో పాత్రను కాస్త హైలైట్‌ చేసి అదే కథను (Teja) తేజ సజ్జా చేస్తారట. అయితే తండ్రి పాత్ర కోసం ఓ సీనియర్ హీరోతో డిస్కషన్స్‌ జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాను ముందు అనుకున్న కల్యాణ్‌ కృష్ణ డైరెక్ట్ చేయడం లేదట. ఆయన స్థానంలో త్రినాథరావు నక్కిన చేస్తారు అని అంటున్నారు. మాటల రచయితగా ప్రసన్నకుమార్‌ బెజవాడ చేస్తారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. నిర్మాత ఎవరు అనేది చూడాలి.

‘బ్రో డాడీ’ సినిమాను యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా తీసుకోకుండా అందులోని మెయిన్‌ పాయింట్‌ను మాత్రమే తీసుకుంటున్నారట. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ, స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసుకుంటారని సమాచారం. మరి అక్కడ స్టార్‌ హీరోలు చేసిన ఈ సినిమాను కుర్ర హీరో ఎలా చేస్తాడు, ఎలా ఉంటుంది అనేది చూడాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus